Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ లో ఆ హీరోయిన్ పడుతున్న తంటాలు..మాములుగా లేవుగా..

By:  Tupaki Desk   |   26 April 2020 7:00 AM IST
లాక్ డౌన్ లో ఆ హీరోయిన్ పడుతున్న తంటాలు..మాములుగా లేవుగా..
X
కరోనా మహమ్మారి వలన ఎన్నో జీవితాలు ఇళ్లలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సెలబ్రిటీల నుంచి సాధారణ ప్రజల వరకు కరోనాతో పోరాటం సాగిస్తున్నారు. అయితే కరోనా కారణంగా షూటింగ్‌లకు బ్రేక్ దొరకడంతో ఎప్పుడు బిజీగా ఉండే సెలబ్రిటీలంతా ఇళ్లలో సరదాగా గడుపుతున్నారు. ఇంటిని శుభ్రం చేయడం, వంటలు చేయడం, ఫిట్‌నెస్‌ కాపాడుకోవడం, గతకాలపు జ్ఞాపకాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం వంటివి చేస్తూ అభిమానులకు చేరువగా ఉంటున్నారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తనలో లాక్ డౌన్ తీసుకొచ్చిన మార్పులను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ‘నేను చివరగా షూటింగ్ చేసిన రోజు మార్చి 18. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నా. లాక్‌డౌన్‌ ముగిసే సమయానికి బద్దకంగా తయారవకుండా ఉండేందుకు పకడ్బందీ షెడ్యూల్‌ను తయారు చేసుకున్నా.

రోజూ ప్రొద్దున 6.30 నుంచి 7లోపు నిద్ర లేస్తాను. కొద్దిసేపు చదువుకుంటాను. ఆ తరువాత యోగా చేస్తాను. ప్రస్తుతం వై వీ స్లీప్‌ అనే పుస్తకాన్ని చదువుతున్నారు. ఇప్పటికే చారియోట్స్‌ ఆఫ్‌ ద గాడ్స్‌, కాస్‌మిక్స్‌ కాన్షియస్‌నెస్‌ రెండు పుస్తకాలను పూర్తి చేశాను. మధ్యాహ్నం సోషల్‌ మీడియాలో కొంచెం సమయం కేటాయిస్తాను. గత రెండేళ్లలో ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్న ప్రతి సినిమాను చూశాను. కొన్ని షోలను కూడా వీక్షిస్తున్నాను. ప్రతి రోజు సాయంత్రం ఓ సినిమాతోపాటు ఏదైనా షోకు సంబంధించిన రెండు మూడు ఎపిసోడ్‌లు చూస్తాను. అలాగే ఇక ముఖ్యమైనది కుకింగ్‌. నాకు వంట మనిషి ఉన్నప్పటికీ నేను వంట చేస్తున్నాను. ఇటీవలే యూట్యూబ్‌లో వంటల ఛానల్‌ ఓపెన్‌ చేశాను. నా బ్రదర్ కూడా ప్రస్తుతం నాతో ముంబైలో ఉంటున్నాడు.

లాక్‌డౌన్‌కు ముందు రోజు నన్ను చూడానికి వచ్చి ఇక్కడే ఇరుక్కుపోయాడు. అంతేగాక.. ‘నా జీవితంలో ఎప్పుడు ఇన్నిరోజులు ఇంటికి పరిమితం కాలేదు. ఇదే నా లైఫ్ లో లాంగ్ బ్రేక్. చిన్నప్పుడు వేసవికాలం సెలవుల్లో కూడా ఇన్ని రోజులు ఒకచోట ఉండలేదు. ఇంతకాలం ఇంట్లో ఉండటం అనేది ఒక కొత్త అనుభూతిలా నేను భావిస్తున్నాను. ఓ విధంగా చెప్పాలంటే ఇది కూడా మంచిదే.. ఎందుకంటే ఇది స్వీయ ఆత్మ పరిశీలన చేసుకునే సమయం. నేను ప్రసస్తుతం పర్సనల్‌ డెవలప్‌మెంట్‌కు ఎక్కువ టైం కేటాయిస్తున్నా. ఇలాంటి సమయంలో మీ ఆరోగ్యం, మీరు ఇష్టపడే వ్యక్తులు, మీ జ్ఞాపకాలు ఎంత ముఖ్యమైనవో తెలుసుకుంటారు. ఎందుకంటే మీ జీవితాన్ని మీరే జీవించాలి. ప్రతి ఒక్కరు ఈ మహమ్మారి నుంచి బయటపడాలని ఆనందంగా జీవించాలని కోరుకోండి. అంటూ చాలా పొడవైన పోస్ట్ చేసి తన పర్సనల్ విషయాలతో పాటు సందేశాన్ని అందించింది.