Begin typing your search above and press return to search.

దర్శకుడు మోసం చేశాడంటున్న హీరోయిన్‌

By:  Tupaki Desk   |   8 Jun 2015 1:31 PM GMT
దర్శకుడు మోసం చేశాడంటున్న హీరోయిన్‌
X
ఇంతకీ ఎవరా హీరోయిన్‌ అంటారా.. ఆనంది అలియాస్‌ రక్షిత. ఆమెను మోసం చేసిన డైరెక్టర్‌ ఎవరంటే.. సర్గుణం. వీళ్లిద్దరి కాంబినేషన్లో చండీవీరన్‌ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌ సందర్భంగా సర్గుణం తనను నమ్మించి మోసం చేశాడంటోంది ఆనంది. ఐతే ఈ మోసం మనం అనుకునే సీరియస్‌ మోసం కాదు. అది సరదా మోసం. సినిమా మొదలుపెడుతున్నపుడు ఓ పాట కోసం మనం న్యూజిలాండ్‌కు వెళ్లబోతున్నాం అని చెప్పాడట సర్గుణం. తొలిసారి ఫారిన్‌ షెడ్యూల్‌కు వెళ్లబోతున్నానని గాల్లో తేలిపోయిందట ఆనంది.

కానీ తీరా చూస్తే ఆ పాట ఇండియాలోనే తీశాడట. ఫారిన్‌కు వెళ్లలేదట. అందుకే ఆడియో ఫంక్షన్లో డైరెక్టర్‌ తనను నమ్మించి మోసం చేశాడంటూ బుంగమూతి పెట్టింది ఆనంది. ముందు సీరియస్‌గా ఈ మాట అన్నపుడు అందరూ అవాక్కయ్యారు కానీ.. తర్వాత అసలు విషయం చెప్పగానే అందరి ముఖాల్లో నవ్వులు పూశాయి. అధ్వర్వ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు బాల నిర్మించడం విశేషం. 'కాయల్‌' అనే హిట్‌ మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంది.. ప్రస్తుతం చేతినిండా అవకాశాలతో జోరుమీదుంది.