Begin typing your search above and press return to search.

రష్మికను విలన్ లా చూడొద్దంటున్నాడు

By:  Tupaki Desk   |   12 Sep 2018 4:03 AM GMT
రష్మికను విలన్ లా చూడొద్దంటున్నాడు
X
ఒకసారి సెలబ్రిటీ అయితే చాలు అంతా హ్యాపీనే అనుకుంటారు చాలామంది జనాలు. కానీ ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా వాళ్ళ ఇబ్బందులు తప్పని సరిగా వాళ్ళకు ఉంటాయి. ఇక వాళ్ళ 'పర్సనల్ లైఫ్' దాదాపుగా పబ్లిక్ లైఫ్ అవుతుంది. వాటికి బోనస్ గా పుకార్లు... గాసిప్పులు! ఇక ఇలాంటి వాటి బారి నుండి తప్పించుకోవడం దాదాపుగా అసాధ్యం. 'ఛలో' తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ సాధించిన రష్మిక తన రెండో సినిమా 'గీత గోవిందం' తో బ్లాక్ బస్టర్ సాధించి స్టార్ హీరోయిన్ లీగ్ లో చేరింది.

ఇదంతా ప్రొఫెషనల్ గా.. మరి పర్సనల్ లైఫ్ లో? కన్నడ 'కిరిక్ పార్టీ' లో తనతో పాటుగా నటించిన రక్షిత్ శెట్టి తో ప్రేమలో పడడం - అ ప్రేమ లాస్ట్ ఇయర్ నిశ్చితార్థం వరకూ రావడం అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఇద్దరి మధ్య సరైన అండర్ స్టాండింగ్ లేకపోవడంతో వాళ్ళ రిలేషన్ బ్రేక్ అయిందని వార్తలు వస్తున్నాయి. కొంతమంది ఆయితే రక్షిత్ కు రష్మిక హ్యాండ్ ఇచ్చిందని కూడా అన్నారు. రీసెంట్ గా రక్షిత్ సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో జనాలు రష్మిక వైపు వేలెత్తి చూపించడం మొదలుపెట్టారు. ఈ విషయంపపై రక్షిత్ శెట్టి స్పందించాడు. ఫేస్ బుక్ లో పెద్ద మెసేజ్ పెట్టాడు.

అందులో ముఖ్యమైన పాయింట్స్ ఎంటంటే "నేను సోషల్ మీడియా నుండి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నది వేరే ముఖ్యమైన విషయాలపై ఫోకస్ చేయడానికే. ఇప్పుడు మళ్ళీ వెనక్కు వచ్చింది కొన్ని విషయాలకు క్లారిటీ ఇచ్చేందుకు మాత్రమే."

"మీ అందరూ రష్మిక గురించి అభిప్రాయలు ఏర్పరుచుకొని ఉంటారు. అలా ప్రొజెక్ట్ చేయడం జరిగింది కాబట్టి నేను మిమ్మల్ని బ్లేమ్ చెయ్యను. మనమందరం చూసిన దాన్ని - విన్నదాన్ని నమ్ముతాం. కానీ అవన్నీ నిజాలు అయి ఉండాల్సిన అవసరం లేదు. చాలాసార్లు మనం అవతల వారి కోణం నుండి ఆలోచించకుండానే కంక్లూజన్ కు వచ్చేస్తాం. నాకు రష్మిక రెండేళ్ళ నుండి తెలుసు.. మీ అందరికన్నా బెటర్ గా తెలుసు. సో.. ప్లీజ్ స్టాప్ జడ్జింగ్ హర్. దయచేసి ఆమెను ప్రశాంతంగా ఉండనీయండి. త్వరలో క్లారిటీ వస్తుంది మీకు నిజం తెలుస్తుంది. మీరు ఈ విషయంలో అసలు మీడియా న్యూస్ ను ఫాలో కావొద్దు. వారెవ్వరికీ అసలు నాకు - రష్మిక కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ గా తెలీదు. అవన్నీ ఊహాగానాలే."

"ఈ పేజిని (ఫేస్ బుక్) కొన్ని రోజులు లైవ్ లో ఉంచాలని నిర్ణయించుకున్నాను. నా మెసేజ్ అందరికీ చేరే వరకూ. ఆ తర్వాత అవసరమైతే వెనక్కివస్తాను. నేను సోషల్ మీడియాను వదిలిపెట్టడానికి ఈ విషయాలకు ఎలాంటి సంబంధం లేదు. ఇదొక వ్యసనం లాగా మారింది కాబట్టి నేను నా పనిపై ఫోకస్ చేయాలనీ అనుకుంటున్నాను."