Begin typing your search above and press return to search.

ప్రభాస్ తో తప్పింది.. పెళ్లి కుదిరింది..

By:  Tupaki Desk   |   7 Jun 2017 6:01 AM GMT
ప్రభాస్ తో తప్పింది.. పెళ్లి కుదిరింది..
X
కన్నడ సినిమా ఇండస్ట్రి 2016 లో ఒక ఊహించని సినిమా అందరి అంచనాలుకు మించి హిట్ కొట్టింది. ‘కిరిక్ పార్ట్’ సినిమా ఒక కాలేజీ స్టూడెంట్స్ బ్యాక్ డ్రాప్ కథగా వచ్చి చక్కటి విజయం అందుకొంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా, హీరోగా రక్షిత్ శెట్టి నటించారు. రక్షిత్ శెట్టి కన్నడ లో యువ నటుడు పైగా కొన్ని సినిమాలును డైరెక్ట్ కూడా చేశాడు. ఇప్పుడు వీళ్ళ ప్రేమ అక్కడ మరో ప్రేమమ్ కథలా అందరినీ మంచిగా ఎంటర్టైన్ చేస్తోంది తెలుసా.

రక్షిత్ శెట్టి పుట్టిన రోజు సందర్భంగా రష్మిక ఈ విషయాన్ని తన ఫేస్ బుక్లో పోస్ట్ చేసింది. “హాపీ బర్త్ డే మై డియర్, నా జీవితంలో నేను కలిసిన మంచి ముత్యం లాంటి మనిషివి నీవు. నిన్ను కలుసుకోవడం నీతో జీవితం పంచుకోవడం నాకు నా కుటంబానికి చాలా ఆనందంగా ఉంది. వెల్కమ్ టు మై బుజ్జి ఫ్యామిలి'' అని చెప్పింది. ఆ విధంగా చూస్తే వీళ్ళ రిలేషన్ ను పెళ్ళితో శుభం కార్డు వేస్తున్నారనే అనుకోవాలి. వీళ్ళు కిరిక్ పార్టీ షూటింగ్ టైమ్ లోనే ప్రేమ పడ్డారని ఎన్నో రూమర్లు వచ్చినా.. దీన్ని బాగానే రహస్యంగా దాచిపెట్టి పెద్దగా రచ్చ చేయకుండా ఇలా స్మూత్ గా కానిచ్చారు.

ఇకపోతే రష్మికను ప్రభాస్ సాహో లో హీరోయిన్ గా ఎంపిక చేయడానికి ప్రయత్నాలు చేశారు కాని.. సెట్టవ్వలేదు. ప్రభాస్ సినిమా తప్పినా కూడా మరో రెండు తెలుగు సినిమాలు చేస్తోందీ కన్నడ భామ. నాగ శౌర్య మరియు రామ్ సినిమాలలో వాళ్ళకి జతగా కనపడనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/