Begin typing your search above and press return to search.

సెన్సార్ చీఫ్ పై ఐటెం బాంబ్ ఫైర్

By:  Tupaki Desk   |   5 Sept 2016 10:38 AM IST
సెన్సార్ చీఫ్ పై ఐటెం బాంబ్ ఫైర్
X
బాలీవుడ్ లో ఐటెం బాంబ్ ఇమేజ్ ఉన్న భామ రాఖీ సావంత్. సెన్సేషన్స్ క్రియేట్ చేయడం కోసం దేనికైనా రెడీ అనే రాఖీ.. ఇప్పుడు సెన్సార్ బోర్డ్ చీఫ్ గా చేసేస్తానంటోంది. అలాగని ఆ పదవిపై ఉన్న వ్యామోహంతో కాదు.. సెన్సార్ బోర్డ్ పై ఇప్పుడీమెకు బాగా మండడమే అసలు రీజన్. అలా కుదరకపోతే.. సెన్సార్ బోర్డ్ ను రద్దు చేసేయాలని కూడా సలహా ఒకటి పారేసింది.

ప్రస్తుతం రాఖీ సావంత్ నటించిన రాఖీ సావంత్ నటించిన మూవీ 'ఏక్ కహానీ జూలీ కీ' అనే మూవీ రిలీజ్ కి రెడీ అయింది. రీసెంట్ గా ఫైనల్ కాపీని సెన్సార్ కి పంపిస్తే.. వాళ్లు ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అమ్మడికి కోపం రావడానికి రీజన్ ఇదే. 'సెన్సార్ బోర్డ్ ను మూసేయాలి. బడా ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి సొమ్ములు దండుకోవడం తప్ప వాళ్లు ఏం చేయడలేదు. పైగా చిన్న నిర్మాతలను వేధింపులకు గురి చేస్తున్నారు. ఛైర్మన్ పదవి నుంచి నిహలానీ తొలగించాలి. అవసరమైతే ఆ ప్లేస్ లో నేను కూర్చుంటాను. అతని కంటే బాగానే పని చేయగలను. మేం సెన్సార్ వాళ్లకు డబ్బులివ్వలేదనే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు' అని కస్సుబుస్సులాడింది రాఖీ సావంత్.

తమ చిత్రానికి ఇలా ఏ సర్టిఫికేట్ ఇవ్వడానికి కారణం.. తాను నటించడమే అన్నది రాఖీ వాదన. తాను పోర్న్ స్టార్ ని కాదని.. ఈ దేశపు ఆడబిడ్డనని.. ఎలాంటి అసభ్య దృశ్యాలు లేని తమ చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఎలా ఇస్తారని నిలదీస్తోంది రాఖీ సావంత్. ఏక్ కహానీ జూలీ కీ చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఇవ్వడంపై ఇప్పటికే బాంబ్ హైకోర్టును కూడా అప్రోచ్ అయిన రాఖీ.. దేశంలో సెన్సార్ బోర్డ్ ని తొలగించాలని డిమాండ్ చేస్తోంది.