Begin typing your search above and press return to search.

4వ సీక్వెల్ వస్తోంది తెలుసా

By:  Tupaki Desk   |   10 Jan 2018 11:00 PM IST
4వ సీక్వెల్ వస్తోంది తెలుసా
X
బాలీవుడ్ లో హృతిక్ రోషన్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై సూపర్ పవర్స్ ఉన్న హీరోగా అందరికి క్రిష్ తో బాగా దగ్గరయ్యాడు. క్రిష్ సిరీస్ లు ఎంత పెద్ద విజయాన్ని అందుకున్నాయో అందరికి తెలిసిందే. అయితే త్వరలో అందుకు కొనసాగింపుగా క్రిష్ 4 సినిమా కూడా రాబోతోంది. ఇప్పటి వరకు ఆ కథతో వచ్చిన సీక్వెల్ సినిమాలు చాలా సక్సెస్ అయ్యాయి. మంచి కలెక్షన్స్ కూడా అందుకున్నాయి.

ఇకపోతే 2020 లో ఆ సినిమా రానుందని హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ తెలిపాడు. హృతిక్ కూడా భారీ విజయాల్ని అందుకొని చాలా కాలమే అవుతోంది. ఇంకా ఖాన్ త్రయం హీరోల రేంజ్ లో హిట్స్ అందుకోలేకపోతున్నాడు. కానీ క్రిష్ 4 తో మెప్పించగలిగితే క్రిష్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను తీరగరాయగలడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో షూటింగ్ ని స్టార్ట్ చేయడానికి దర్శకుడు రాకేష్ రోషన్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ రోజు హృతిక్ రోషన్ పుట్టిన రోజు సందర్బంగా ఈ విషయాన్ని చెప్పడం అందరికి మంచి కిక్ ని ఇచ్చింది. మరి తనయుడిని రాకేష్ రోషన్ క్రిష్ 4 తో ఏ స్థాయికి తీసుకెళతాడో చూడాలి. ప్రస్తుతం హృతిక్ రోషన్ ఆ కథ కోసం తన బాడీని కొంచెం మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. చివరగా హృతిక్ కాబిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.