Begin typing your search above and press return to search.

ఆమె గురించి అతడు నోరు విప్పితే అంతేనట

By:  Tupaki Desk   |   26 Sept 2016 4:39 PM IST
ఆమె గురించి అతడు నోరు విప్పితే అంతేనట
X
బాలీవుడ్ లో హీరో.. హీరోయిన్ల మధ్య ఎఫైర్ల రచ్చ కాస్త ఎక్కువే. ఎప్పుడు ఎవరితో కలిసి ఉంటారో.. ఎప్పుడు ఎవరు ఎవరికి బ్రేకప్ చెప్పేస్తారో అంత తేలికైన యవ్వారం కాదు. ఎఫైర్ నడుస్తున్నప్పుడు ఎంత గుట్టుగా వ్యవహారాన్ని నడిపిస్తారో.. లెక్క తేడా వస్తే అంతగా రచ్చ రచ్చ చేసుకుంటారు. ఆ మధ్య బాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన హృతిక్ రోషన్.. క్వీన్ కంగనారౌనత్ వ్యవహారం ఎంత రచ్చగా మారిందో తెలిసిందే.

వీరిద్దరి మధ్య ఎఫైర్ గుట్టుగా స్టార్ట్ అయినా.. బ్రేకప్ మాత్రం గబ్బు గబ్బుగా మారి.. సోషల్ మీడియా సాక్షిగా తిట్టుకోవటమేకాదు.. లీగల్ నోటీసులు సైతం ఇచ్చుకున్నారు. వీరి మధ్య తగువు మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనే హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎపిసోడ్ లో కంగనా చెలరేగిపోతే.. హృతిక్ మాత్రం ఆచితూచి రియాక్ట్ అయ్యాడే కానీ.. పెద్దగా నోరు విప్పలేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా హృతిక్ తండ్రి.. ప్రముఖ నిర్మాత రాకేష్ రోషన్ కు ఉన్నట్లుండి ఏమైందో కానీ కంగనా పేరు ప్రస్తావించకుండా.. ఆమెపై ఘాటు విమర్శలు చేశారు. హృతిక్ విభిన్నమైన వ్యక్తి అని.. కానీ ఒకరు మాత్రం అతని గురించి అబద్ధాలు ప్రచారం చేశారని కంగనా మీద పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఆమె విమర్శలు చేసినా.. హృతిక్ మాత్రం హుందాగా వ్యవహరించారని చెప్పారు. హృతిక్ కానీ నిజం ఏమిటన్నది బయటకు చెబితే అందరూ షాక్ కావటం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆ నిజం ఏమిటో ఎప్పుడు.. ఎవరు చెబుతారు? చెప్పేదేదో పూర్తిగా చెప్పకుండా.. అరకొరగా చెప్పేసి అతృతను పెంచటం ఏమిటి చెప్మా..?