Begin typing your search above and press return to search.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' నిర్మాత..ఆయనతో సినిమా!

By:  Tupaki Desk   |   4 July 2019 10:53 AM GMT
లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత..ఆయనతో సినిమా!
X
వివాదం రేపిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను రూపొందించిన నిర్మాత రాకేష్ రెడ్డి తన తదుపరి సినిమాను అనౌన్స్ చేశాడు. వివాదాస్పదం అయిన సినిమాతో ఈ నిర్మాత బాగానే సంపాదించాడని టాక్. ఆ సినిమా అంత బాగోలేకపోయినా - అనుకున్న పాయింట్ ను కూడా సరిగా చెప్పలేదని రివ్యూలు వచ్చినా కలెక్షన్లు అయితే ఆ సినిమాకు బాగానే వచ్చాయట.

సరిగా విడుదల అయ్యింది తెలంగాణ ప్రాంతంలో మాత్రమే. ఏపీలో ఆ సినిమా విడుదలకు ఈసీ కీలకమైన సమయంలో అనుమతిని ఇవ్వలేదు. దీంతో..తెలంగాణలో మాత్రమే డబ్బులు వచ్చాయి. అయినప్పటికీ లాభాలే చవిచూశాడట ఆ నిర్మాత.

ఈ నేపథ్యంలో మరిన్ని సినిమాలకు ఉత్సాహంగా రెడీ అవుతున్నట్టుగా రాకేష్ రెడ్డి చెబుతున్నాడు. అందులో భాగంగా చిన్ని కృష్ణ రచనలో ఒక సినిమాను రూపొందించబోతున్నట్టుగా రాకేష్ రెడ్డి ప్రకటించాడు. ఆ సినిమా కథ సూపర్ గా ఉందని, అది 'అర్జున్ రెడ్డి, ని మించిపోయేలా ఉందని రాకేష్ రెడ్డి చెబుతూ ఉండటం గమనార్హం!