Begin typing your search above and press return to search.

కట్టప్ప సీక్రెట్ బయటకెళ్లిపోయింది

By:  Tupaki Desk   |   29 Nov 2016 3:57 AM GMT
కట్టప్ప సీక్రెట్ బయటకెళ్లిపోయింది
X
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి.. అత్యంత భద్రంగా ఎవరికీ చెప్పకుండా ఎవరికీ తెలీకుండా.. కనీసం బాహుబలి2 కి పని చేస్తున్నవారికి కూడా తెలియనివ్వుకుండా జాగ్రత్త పడుతున్న సీక్రెట్ ఒకటి ఉంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్న బాగా ట్రెండింగ్ మాత్రమే కాదు.. గతేడాది నుంచి ఆడియన్స్ ను వేధిస్తున్న పజిల్ కూడా.

రైటర్ కి.. రాజమౌళికి.. బాహుబలికి.. కట్టప్పకి మాత్రమే ఇప్పటివరకూ ఈ సీక్రెట్ తెలియగా.. ఇప్పుడా సీక్రెట్ బయటికెళ్లిపోయింది. మరో వ్యక్తి చెవిలో పడిపోయింది. అయనెవరో కాదు.. కేంద్ర సమాచార శాఖా మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్. సమాచార మంత్రి కదా.. ఎలాగోలా సమాచారం సేకరించారని అనుకోవాల్సిన పని లేదు.. స్వయంగా రాజమౌళే ఈ రహస్యం చెప్పేశాడట. గోవాలో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా మాట్లాడిన కేంద్ర మంత్రి.. కట్టప్ప సీక్రెట్ తనకు తెలుసంటూ షాక్ఇచ్చాడు. 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో చెప్పినందుకు థ్యాంక్స్' కూడా సభాముఖంగా చెప్పేశారీయన.

'ఈ ప్రభుత్వానికి అన్నీ తెలియాలి. అలాగే మా ప్రభుత్వం రహస్యాలను కాపాడుతుందనే సంగతి కూడా ఆయనకు తెలుసు. అందుకే నాకు చెప్పారు. ఈ సీక్రెట్ సేఫ్ గా ఉంటుంది' అనేశారు రాధోడ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/