Begin typing your search above and press return to search.

మిల్కీ బ్యూటీతో రాజు గారి గది 3 షురు

By:  Tupaki Desk   |   20 Jun 2019 10:52 AM IST
మిల్కీ బ్యూటీతో రాజు గారి గది 3 షురు
X
హారర్ సినిమాలకు మిల్కీ బ్యూటీ తమన్నా కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తోంది. గత మూడేళ్ళుగా ఇదే జానర్ లో చేస్తూ మెప్పిస్తూ వచ్చిన ఈ అమ్మడు తాజాగా ఓంకార్ తో జట్టు కట్టింది. రాజు గారి గది సిరీస్ లో మూడో భాగం ఇవాళ లాంచనంగా మొదలైంది. ఓంకార్ దర్శకత్వంలో తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా ఇందులోనూ కొనసాగనున్నాడు. దిల్ రాజు క్లాప్ తో పూజా కార్యక్రమాలతో పాటు మొదటి షాట్ తీశారు . రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచే కంటిన్యూ కానుంది.

రాజు గారి గది 2 పివిపి బ్యానర్ పై రూపొందగా ఇది మాత్రం ఒక్ ఎంటర్ టైన్మెంట్ పై ఓంకార్ స్వంతంగా నిర్మిస్తున్నాడు. ఇందులో ఇంకొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. శాతకర్ణి-ఎన్టీఆర్-సైరా లాంటి ప్రతిష్టాత్మక చిత్రాలకు సంబాషణలు అందించిన బుర్రా సాయి మాధవ్ రచనలో ఇది రానుండగా ప్రముఖ కెమెరా మెన్ చోటా కే నాయుడు ఛాయాగ్రహణ బాద్యతలు స్వీకరించారు

టాప్ టెక్నికల్ టీం తో రూపొందుతున్న రాజు గారి గది 3 మొదటి రెండు భాగాల కంటే మెరుగైన అంశాలతో రూపొందిస్తున్నట్టు ఓంకార్ చెబుతున్నాడు. సెకండ్ పార్ట్ లో నాగర్జున రోల్ తో సమంతా పెర్ఫార్మన్స్ సినిమాను నిలబెట్టింది. కాని ఇందులో మొత్తం తమన్నా భుజాల మీద నడిచేలా ఉంది. ఇతర తారాగణానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది చివరి లోపే విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడు ఓంకార్. తమన్నా పాత్ర కూడా ఎవరు ఊహించని విధంగా ఉంటుందట. అశ్విన్ బాబు తమన్నాకు జోడినా లేక ఇంకేదైనా వేరే తరహలో ఉంటుందా తెలియాల్సి ఉంది