Begin typing your search above and press return to search.

త‌లైవా కాలా ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది

By:  Tupaki Desk   |   25 May 2017 6:39 AM GMT
త‌లైవా  కాలా ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది
X
సూప‌ర్ స్టార్ 161 చిత్రం పేరును డిసైడ్ చేసేశారు. పా. రంజిత్ డైరెక్ష‌న్ లో త‌లైవా మ‌రో సినిమా చేయ‌టానికి ఓకే చెప్పేయ‌టం తెలిసిందే. ఈ చిత్రానికి ఏం పేరు పెడ‌తార‌న్న ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది. ఆ ఉత్కంట‌ను తీరుస్తూ.. తాజాగా ఆ చిత్రానికి కాలా పేరును ఖ‌రారు చేసిన‌ట్లుగా ర‌జ‌నీ అల్లుడు.. చిత్ర నిర్మాత‌.. న‌టుడు ధ‌నుష్ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని ధ‌నుష్ త‌న వండ‌ర్ బార్ ఫిలిమ్స్ ద్వారా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌జ‌నీ స‌ర‌స‌న బాలీవుడ్ న‌టి ఖురేషీ హ్యూమా న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్ర‌లో ద‌ర్శ‌క న‌టుడు స‌ముద్ర‌గ‌ని న‌టిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. 2018లో విడుద‌ల‌య్యే ఈ సినిమాకు సంతోష్ నారాయ‌ణ మ్యూజిక్ ఇవ్వ‌నున్నారు. పేరుకు త‌గ్గ‌ట్లే న‌ల్ల‌టి బ్యాక్ గ్రౌండ్ లో ర‌జ‌నీ ఫేస్ ను ఎర్ర‌టి డిజైన్‌తో ఉండ‌టంతో పాటు..ఎర్ర‌టి అక్ష‌రాల‌తో కాలా అంటూ వ‌చ్చిన ఫ‌స్ట్ లుక్ ఆక‌ర్షించేలా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/