Begin typing your search above and press return to search.

`మేడ్ ఇన్ చైనా`లో నాగిని నాట్యమా?

By:  Tupaki Desk   |   24 Sep 2019 12:02 PM GMT
`మేడ్ ఇన్ చైనా`లో నాగిని నాట్యమా?
X
`నాగిన్` హిందీ ధారావాహిక‌తో కేవ‌లం హిందీ ప‌రిశ్ర‌మ‌లోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా ఫాలోయింగ్ తెచ్చుకుంది మౌనీరాయ్. ఈ సీరియ‌ల్ ద్వారా వ‌చ్చిన క్రేజ్‌తో బాలీవుడ్ లో పాగా వేసింది. కిలాడీ అక్ష‌య్ కుమార్ స‌ర‌స‌న `గోల్డ్` అనే హిస్టారిక‌ల్ స్పోర్ట్స్ డ్రామాలో న‌టించింది. ప్ర‌స్తుతం అక్క‌డ వ‌రుస‌గా సినిమాల‌తో బిజీగా ఉంది. బ్ర‌హ్మాస్త్ర‌- మొఘ‌ల్ లాంటి భారీ చిత్రాల్లో మౌనీ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోంది.

ఓవైపు సినిమాల‌తో పాటు స్పెష‌ల్ గీతాల‌తో హల్‌చ‌ల్ చేస్తోంది. సౌత్ లో ఆరంభ‌మే క్రేజీ సినిమాలో ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించింది. క‌న్న‌డ బ్లాక్ బ‌స్ట‌ర్ `కేజీఎఫ్‌`లో మౌనీరాయ్ చేసిన ప్ర‌త్యేక గీతం పాపుల‌ర్ కావ‌డంతో ఆమెకు మ‌రిన్ని హాట్ ఐట‌మ్ నంబ‌ర్స్ వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. తాజాగా రాజ్‌కుమార్ రావు న‌టించిన తాజా చిత్రం `మేడ్ ఇన్ చైనా`లో మౌనీ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇందులో ఓ గీతంలో ప్ర‌త్యేక న‌ర్త‌న‌తో ఆక‌ట్టుకుంది.

`ఒదానీ..` అంటూ సాగే ప్ర‌త్యేక గీతానికి సంబంధించిన వీడియోని మేక‌ర్స్ ఈ రోజు విడుద‌ల చేశారు. ఈ పాట‌లో నాగిన్ ఫేం మౌనీరాయ్ త‌న అంద‌చందాల‌తో దుమ్ము దులిపింది. ఈ పాట‌లో మ‌రోసారి త‌న కిల్ల‌ర్ లుక్స్ తో అంద‌రినీ మాయ‌లో ప‌డేసింది. హాటెస్ట్ అప్పియ‌రెన్స్‌.. స్టెప్పుల్లో గ్రేస్‌ఫుల్ మూవ్‌మెంట్స్ తో కిర్రెక్కించేసింది. చైనాలో త‌యారైన శృంగారానికి సంబంధించిన డ్ర‌గ్ నేప‌థ్యంలో ఫ‌న్నీ ఎంట‌ర్ టైనర్ ఇది. ఈ చిత్రానికి మౌని అంద‌చందాలు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కానున్నాయి.