Begin typing your search above and press return to search.

ఆ హీరోపై క‌క్ష క‌ట్టి ఈ హీరోని తెచ్చాడు!

By:  Tupaki Desk   |   23 Nov 2021 7:30 AM GMT
ఆ హీరోపై క‌క్ష క‌ట్టి ఈ హీరోని తెచ్చాడు!
X
బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ తన కొత్త నెట్ ఫ్లిక్స్ సినిమా `ధమాకా` ప్రమోషన్ లో బిజీగా ఉన్నందున ఇటీవల వార్తల్లో నిలిచాడు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనలు లభిస్తున్నాయి. అయితే చాలా మంది అభిమానులు ఈ చిత్రంలో కార్తీక్ అద్భుత‌మైన‌ నటనకు ఫిదా అయ్యారు.

తాజా స‌మాచారం ప్రకారం.. ధర్మ ప్రొడక్షన్స్ కొత్త‌ ప్రాజెక్ట్ లో కార్తీక్ రీప్లేస్ మెంట్ చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వాస్తవానికి ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ న‌టించాల్సిన‌ది. అయితే ఈ ఒప్పందం రెండు పార్టీల మ‌ధ్య బెడిసికొట్టింది.

కార్తీక్ ఆర్య‌న్ తో క‌ర‌ణ్ వివాదం తెలిసిన‌దే. కార్తీక్ కొన్ని నెలల క్రితం కరణ్ జోహార్ తో గొడవ పడ్డాడు. ఇది ధర్మ ప్రొడక్షన్స్ దోస్తానా 2 నుండి అతని నిష్క్రమణకు దారితీసింది.

ఆ నటుడు వృత్తిపరంగా క‌మిట్ మెంట్ లేనివాడు అంటూ చిత్రించ‌డం తెలిసిన‌దే. స్క్రిప్ట్ ఎలా రూపుదిద్దుకుందనే దానితో సంతృప్తి చెందకపోవడంతో కార్తీక్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని కొన్ని క‌థ‌నాలు వెల్ల‌డించాయి.

అతని పాత్ర కోసం రీకాస్టింగ్ ను ధర్మ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత కరణ్ జోహార్ కూడా ఇన్ స్టాగ్రామ్ లో నటుడిని అన్ ఫాలో చేసాడు. భవిష్యత్తులో కార్తిక్ ఆర్యన్ తో కలిసి ప‌ని చేయ‌బోమని ప్రొడక్షన్ హౌస్ స్పష్టం చేసింది.

ఇప్పుడు కార్తీక్ ఆర్య‌న్ స్థానంలో రాజ్ కుమార్ రావ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. జాన్వీ- రాజ్ కుమార్ జంట‌గా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. మిస్ట‌ర్ అండ్ మాహీ అనే టైటిల్ ని ఎంపిక చేయ‌డం ఆస‌క్తిక‌రం.