Begin typing your search above and press return to search.

బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్‌ కు యాక్సిడెంట్

By:  Tupaki Desk   |   11 Aug 2015 9:43 AM GMT
బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్‌ కు యాక్సిడెంట్
X
మున్నాభాయ్ ఎంబీబిఎస్ - లగేరహో మున్నాభాయ్ - త్రీ ఇడియట్స్ - పీకే లాంటి సినిమాలతో భారత నెంబర్ వన్ దర్శకుడిగా కీర్తి గడించిన రాజ్ కుమార్ హిరాని మంగళవారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ముంబయిలో బైకుపై వెళుతుండగా ఆయన అదుపుతప్పి పడిపోయారు. ఆయనకు కొంచెం పెద్ద గాయాలే అయ్యాయి. ఐతే అవి మరీ ప్రమాదకరమేమీ కాదని వైద్యులు తెలిపారు. మంబయిలోని లీలావతి ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచి హిరానికి చికిత్స అందిస్తున్నారు.

హిరాని దగ్గర పని చేసే ఉద్యోగి ఒకరు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొన్నారు. దాన్ని చూసి ముచ్చటపడి నడపాలని ప్రయత్నించారు. ఐతే హిరాని భారీ కాయుడేమీ కాదు. అయినప్పటికీ భారీగా ఉండే ఎన్ఫీల్డ్ నడపాలని ప్రయత్నించారు. బండిని స్లోగానే నడిపినా దాన్ని అదుపు చేయలేకపోయారు. రోడ్డు మీద పడటం.. తన మీద బైక్ పడటంతో ఆయనకు గాయాలయ్యాయి. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆసుపత్రికి వెళ్లి హిరానిని పరామర్శించారు. సినిమాకు, సినిమాకు బాగా గ్యాప్ తీసుకునే హిరాని.. పీకే తర్వాత సంజయ్ దత్ జీవిత కథతో సినిమా తీయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.