Begin typing your search above and press return to search.

చింపూ క‌పూర్‌.. ఓ ప‌రాజితుడి గాధ!

By:  Tupaki Desk   |   10 Feb 2021 12:00 PM IST
చింపూ క‌పూర్‌.. ఓ ప‌రాజితుడి గాధ!
X
ఒక ఇంట్లో జ‌న్మించిన వారంతా ఒకే విధంగా ఎద‌గ‌డం సాధ్యం కాక‌పోవ‌చ్చు. కొన్నిసార్లు అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. చాలా సార్లు అది అసాధ్యంగానే మిగిలిపోతుంది. రాజ్‌కపూర్ ఫ్యామిలీలో ఇదే జ‌రిగింది. ఆయ‌న ముగ్గురు కుమారుల్లో రిషి కపూర్‌ హీరోగా హిట్ కొట్టాడు. ర‌ణ్‌ధీర్‌ కపూర్ స్టార్ గా రాణించలేకపోయినా.. తన కుమార్తెలతో ఫేమ‌స్ అయ్యాడు. ఇక మిగిలిన‌ రాజీవ్‌ కపూర్(చింపూ కపూర్‌) మాత్రం అన్ని విభాగాల్లోనూ ఆశించిన స్టార్ డ‌మ్ ను సాధించ‌లేక‌పోయాడు. నటుడు, దర్శకుడు, నిర్మాత.. ఇలా అన్ని రంగాల్లోనూ ప్ర‌య‌త్నిచిన‌ప్ప‌టికీ.. విఫ‌ల‌మ‌య్యాడు. 58 ఏళ్ల వ‌య‌సులో మంగళవారం (ఫిబ్రవరి 9) హార్ట్‌ ఎటాక్‌తో మరణించాడు.

రాజ్ క‌పూర్ ఫ్యామిలీది బాలీవుడ్లో చాలా పెద్ద చ‌రిత్ర‌. పృథ్వీరాజ్‌ కపూర్‌కు ముగ్గురు కుమారులు. వారిలో రాజ్‌ కపూర్ మాత్ర‌మే స్టార్ హీరో అయ్యాడు. ఇత‌ని సోద‌రులు షమ్మీ కపూర్, శశికపూర్ హీరోగా నిల‌బ‌డ‌డానికి చాలా స్ట్రగుల్‌ చేయాల్సి వచ్చింది. చివ‌ర‌కు ఎలాగోలా స్ట్రగుల్ ప‌డి నిలబడ్డారు. కానీ.. త‌ర్వాతి త‌రంలో ప‌రిస్థితి మ‌రింత ఇబ్బంది క‌రంగా ఉంది. రాజ్‌కపూర్‌కు జన్మించిన ముగ్గురు కొడుకుల్లో రిషి కపూర్‌ ఒక్కడే స్టార్‌ హీరో అయ్యాడు. రణ్‌ధీర్‌ కపూర్‌, రాజీవ్ క‌పూర్‌(చింపూ క‌పూర్‌) హీరోలుగా ట్రై చేసినా స్టార్ డ‌మ్ సాధించ‌లేక‌పోయారు.

చివ‌రి వాడైన‌ రాజీవ్‌ కపూర్‌ను అందరూ చింపూ కపూర్‌ అని పిలిచేవారు. ఆయ‌న‌కు 20 ఏళ్లురాగానే.. బాలీవుడ్‌లో హీరోగా వ‌రుస‌గా సినిమాలు చేశాడు. ఆ విధంగా.. అతని మొదటి సినిమా ‘ఏక్‌ జాన్‌ హై హమ్‌’ 1983లో వ‌చ్చింది. ఆ సినిమాలో బాబాయి షమ్మీ కపూర్‌ అతనికి తండ్రిగా నటించాడు. దీంతో.. ఇద్ద‌రూ ప్రేక్షకులకు ఒకే విధంగా కనిపించాడు. అంతేకాదు.. షమ్మీ కపూర్‌ను నటనలో అనుకరించడంతో రాజీవ్‌ కపూర్‌ మీద ఆయ‌న‌ ముద్రపడింది.

దీంతో 1985లో రాజీవ్ క‌పూర్ ను గట్టెక్కించడానికి రాజ్‌కపూర్‌ రంగంలోకి దిగాడు. తను తీస్తున్న ‘రామ్‌ తేరి గంగా మైలీ’లో హీరోగా బుక్‌ చేశాడు. ఆ సినిమా సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. అంతే కాదు రాజీవ్‌ కపూర్‌ మీద ఉన్న షమ్మీ కపూర్‌ ముద్రను చెరిపేసింది. ఆ తర్వాత రాజీవ్‌ కపూర్‌ ‘ఆస్మాన్‌’, ‘జబర్దస్త్‌’లాంటి సినిమాలు చేశాడు. కానీ.. అవి ఆడలేదు. దీంతో.. నిర్మాతగా మారాడు రాజీవ్‌.

రాజీవ్‌ కపూర్‌ నిర్మాతగా వ్యవహరించిన‌ ‘హెన్నా’ హిట్‌ అయ్యింది. ఆ తర్వాత ద‌ర్శ‌కుడిగా మారి ‘ప్రేమ్‌గ్రంథ్‌’ సినిమా తీశాడు రాజీవ్ క‌పూర్‌. కానీ.. అది ఫ్లాప్‌ అయ్యింది. రిషి కపూర్‌ను దర్శకుడుగా పెట్టి ‘ఆ అబ్‌ లౌట్‌ చలే’ నిర్మించాడు. అది కూడా ఆడలేదు. దీంతో.. క్ర‌మ క్ర‌మంగా ఇండస్ట్రీకి దూరమ‌య్య‌డు రాజీవ్‌ కపూర్‌.

ఆ త‌ర్వాత ఆర్తిసబర్వాల్‌ అనే ఆర్కిటెక్ట్‌తో 2001లో రాజీవ్ క‌పూర్ వివాహం జరిగింది. కానీ.. రెండేళ్లలోనే విడాకులు తీసుకున్నారు. గ‌తేడాది లాక్‌డౌన్ త‌ర్వాత‌ ముంబై చెంబూర్‌లోని రణ్‌ధీర్‌ కపూర్‌ దగ్గరకు వచ్చి నివసిస్తున్నాడు రాజీవ్‌ కపూర్‌. ఈ క్ర‌మంలోనే హార్ట్‌ఎటాక్ రావ‌డంతో ఫ్యామిలీని విషాదంలో ముంచేస్తూ.. వెళ్లిపోయారు రాజీవ్‌ కపూర్.