Begin typing your search above and press return to search.

రక్షణ కోసం పోలీసులకు రజినీ భార్య విజ్ఞప్తి

By:  Tupaki Desk   |   2 Feb 2019 4:54 PM GMT
రక్షణ కోసం పోలీసులకు రజినీ భార్య విజ్ఞప్తి
X
తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ కుమార్తె సౌందర్య రెండవ వివాహంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సౌందర్య వివాహ నిశ్చితార్థం విషగన్‌ వానాంగమూడితో జరిగిన విషయం తెల్సిందే. నిశ్చితార్థం సింపుల్‌ గా రెండు కుటుంబాల సమక్షంలో జరిగింది. కాని పెళ్లి మాత్రం పోయేస్‌ గార్డెన్‌ లోని రజినీకాంత్‌ ఇంట్లో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌ చేశారు. రజినీకాంత్‌ ఇంట ఫిబ్రవరి 10 నుండి పెళ్లి వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. మూడు రోజుల పాటు అంటే ఫిబ్రవరి 12 వరకు పెళ్లి తంతు ఉంటుందని తమిళ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

ఈ పెళ్లి కోసం తమిళనాడు సినీ, రాజకీయ మరియు వ్యాపార ప్రముఖులు ఎంతో మంది హాజరు కాబోతున్నారు. అందుకే రజినీకాంత్‌ భార్య లత పెళ్లికి బందోబస్తు ఏర్పాటు కోసం పోలీసులకు విజ్ఞప్తి చేశారు. పెద్ద ఎత్తున సెలబ్రెటీలు, ప్రముఖులు రాబోతున్న నేపథ్యంలో తమ ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేయడంతో పాటు, పెళ్లి జరిగే మూడు రోజుల పాటు ట్రాఫిక్‌ ను క్రమబద్దీకరించాలంటూ పోలీసులకు ఆమె విజ్ఞప్తి చేశారు. రాతపూర్వకంగా లత గారు పోలీసులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. అందుకు పోలీసులు కూడా ఓకే చెప్పి ఫిబ్రవరి 10, 11, 12వ తేదీల్లో భద్రత కల్పించేందుకు ఒప్పుకున్నారు.