Begin typing your search above and press return to search.

తన నిర్మాతకి ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన రజినీకాంత్

By:  Tupaki Desk   |   8 Oct 2019 1:30 AM GMT
తన నిర్మాతకి ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన రజినీకాంత్
X
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నటుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ముందు వరుసలో ఉంటారు. తన ఎదుగుదలకు తోడ్పడిన ప్రతి ఒక్కరినీ ఆయన చాలా గౌరవిస్తారు. ఆగస్టు 14న కలైజ్ఞానం సన్మాన సభ చెన్నైలో జరిగింది. అక్కడకు వచ్చిన అతిథులు ఇప్పటికీ కలైజ్ఞానం అద్దె ఇంట్లో ఉంటున్నారని, తమిళనాడు గవర్నమెంట్ ఆయనకు సొంత ఇల్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వార్త విన్న రజనీ ఆయనకు సొంత ఇల్లు తాను కొనిస్తానని మాట ఇచ్చారు.

అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఆయనకి రజనీ ఇల్లు కొనిచ్చారు. సోమవారం గృహ ప్రవేశం కూడా చేశారు. ఈ గృహ ప్రవేశానికి రజనీ కాంత్ హాజరయ్యారు. ఈ గృహ ప్రవేశం ఫోటోలు చూసిన రజని అభిమానులు ఆయనని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రజినీ కొనిచ్చిన ఇల్లు దాదాపు కోటి రూపాయలు ఉంటుందని అంటున్నారు. 1978లో రజనీ మొదట సోలో హీరోగా చేసిన చిత్రం 'భైరవి' కి కలైజ్ఞానం నిర్మాతగా ఉన్నారు. ఇప్పుడు అలాంటి నిర్మాత కష్టాల్లో ఉంటే ఆదుకుని రజనీ కొంతైనా ఋణం తీర్చుకున్నారు.