Begin typing your search above and press return to search.

రజినీ వద్దన్నది నిజమేనన్న మాట!

By:  Tupaki Desk   |   5 July 2015 9:00 PM IST
రజినీ వద్దన్నది నిజమేనన్న మాట!
X
దృశ్యం.. సౌత్‌ నుంచి నార్త్‌ వరకు అన్ని ఇండస్ట్రీల వాళ్లూ మక్కువ చూపిన మలయాళ సినిమా. తెలుగులో సూపర్‌ హిట్టయిన ఈ సినిమా ఇప్పుడు తమిళంలో 'పాపనాశం' పేరుతో విడుదలై అక్కడ కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఐతే దర్శకుడు జీతు జోసెఫ్‌ తమిళంలో ముందు కమల్‌తో కాకుండా రజినీకాంత్‌తో చేయాలనుకున్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. ఐతే అది నిజమేనని.. తాను ముందు రజినీనే సంప్రదించానని జీతూనే స్వయంగా వెల్లడించాడు. రజినీతో సినిమా పట్టాలెక్కకపోవడానికి కారణం కూడా చెప్పాడు.

''దృశ్యం రీమేక్‌ కోసం ముందు రజినీ సార్‌నే అడిగాను. ఐతే రెండు సన్నివేశాల విషయంలో ఆయన అభ్యంతరం చెప్పారు. పోలీస్‌ స్టేషన్‌లో హీరో, అతడి కుటుంబ సభ్యుల్ని పోలీసులు కొట్టే సీన్‌ తనకు సరిపోదని చెప్పారు. ఇలా చేస్తే తన అభిమానులు తట్టుకోలేరని అన్నారు. క్లైమాక్స్‌ విషయంలో కూడా కొంత అభ్యంతరం చెప్పారు. ఐతే ఈ సన్నివేశాలు మార్చాలని ఆయన అనలేదు. రజినీ చెప్పిందాంతో నేను కన్విన్స్‌ అయ్యాను. ఆ తర్వాత కమల్‌ సార్‌ను సంప్రదించాను. ఆయనతో సినిమా ఓకే అయింది'' అని చెప్పాడు జీతు. మలయాళంలో దొర్లిన తప్పుల్ని సరిదిద్దుకుని.. తమిళంలో సినిమా తీశానని.. కొన్ని ఆసక్తికర విశేషాలకు సంబంధించిన డీటైలింగ్‌ కూడా ఉండేలా చూసుకున్నానని అందుకే నిడివి పెరిగిందని.. మలయాళం, తెలుగుతో పోలిస్తే తమిళ ఆడియన్స్‌ను మరింతగా ఈ సినిమా ఆకట్టుకుంటోందని జీతు అన్నాడు.