Begin typing your search above and press return to search.

రజినీ-రాధిక.. రొమాంటిక్ సీన్

By:  Tupaki Desk   |   5 March 2016 5:00 PM IST
రజినీ-రాధిక.. రొమాంటిక్ సీన్
X
ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ 60 ఏళ్లు పైబడ్డాక కూడా కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ చేశారు. నాగేశ్వరరావు అయితే.. ఏకంగా కాలేజీ బుల్లోడిగా కనిపించాడు, లవర్ బాయ్ తరహా పాత్రలో శ్రీదేవితో రొమాన్స్ కూడా చేశాడు. కానీ ఇప్పటి హీరోలు అలా కనిపిస్తే అదోలా అనిపిస్తుంది. వయసుకు తగ్గట్లు హుందాగా ఉండే పాత్రలే చేస్తున్నారు మన సీనియర్ హీరోలు. హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి సిగ్గుపడిపోతున్నారు. ముఖ్యంగా రజినీకాంత్ కొన్నేళ్లుగా కొంచెం హుందాగా ఉండే పాత్రలే పోషిస్తూ వస్తున్నాడు. హీరోయిన్లతో పెద్దగా రొమాన్స్ చేయట్లేదు.

ఐతే తన కొత్త సినిమా ‘కబాలి’లో మాత్రం రజినీ రూటు మారుస్తున్నాడట. హీరోయిన్ రాధికా ఆప్టేతో ఆయనకు కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. గోవాలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సన్నివేశాలు షూట్ చేశారట. అక్కడే ఓ రొమాంటిక్ సాంగ్ కూడా వస్తుందట వీళ్లిద్దరి మధ్య. రజినీ సినిమాలో యంగ్ గా కనిపించే ఎపిసోడ్లో ఈ సన్నివేశాలు, పాట వస్తాయట. ఐతే సినిమాలో మెజారిటీ పార్ట్ రజినీ మిడిలేడ్జ్ క్యారెక్టర్లోనే కనిపిస్తాడట. అందులో తన ఒరిజినల్ గడ్డంతో, తెల్లటి విగ్గుతో దర్శనమిస్తాడు రజినీ. ఈ గెటప్ కు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సంచలనం రేపుతున్నాయి. అట్టకత్తి, మద్రాస్ లాంటి విభిన్నమైన సినిమాలు తీసిన పా రంజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మేలో ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో ‘కబాలి’ విడుదలవుతుంది.