Begin typing your search above and press return to search.

సైనికుడిగా సూపర్ స్టార్

By:  Tupaki Desk   |   8 Dec 2018 10:10 PM IST
సైనికుడిగా సూపర్ స్టార్
X
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు మామూలు ఊపులో లేడు. ఆయన కొత్త సినిమా ‘2.0’ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే రాబడుతోంది. దీని తర్వాత పెద్దగా గ్యాప్ లేకుండానే మళ్లీ బాక్సాఫీస్ రేసులో నిలవబోతున్నాడు రజనీ. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో ఆయన నటించిన ‘పేట్ట’ చకచకా విడుదలకు ముస్తాబవుతోంది. తెలుగు సంగతేమో కానీ.. తమిళంలో మాత్రం ఈ చిత్రం సంక్రాంతికే రిలీజవుతుందని అంటున్నారు. ఈ సిినిమా నెమ్మదిగా హైప్ బిల్డప్ అవుతోంది. ‘పేట్ట’ పోస్టర్లు.. ఇప్పటిదాకా రిలీజైన రెండు పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఆదివారమే ఫుల్ ఆడియో బయటికి వచ్చేస్తోంది. అందులో నాలుగు థీమ్ మ్యూజిక్ ట్రాక్స్ సహా మొత్తం 11 పాటలుండటం విశేషం.

‘పేట్ట’లో రజనీ పాత్ర గురించి కూడా ఆసక్తికర ప్రచారం నడుస్తోంది. ఇందులో సూపర్ స్టార్ క్యారెక్టర్ లో రెండు షేడ్స్ ఉంటాయట. కొంతసేపు ఆయన సైనికుడిగా కనిపిస్తాడట. తర్వాత మిలిటరీ నుంచి రిటైరై.. జన జీవనంలోకి వస్తాడట. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన కాలేజీ హాస్టల్ వార్డన్ పాత్రలో కనిపిస్తాడట. మామూలుగా సూపర్ స్టార్ సినిమా అంటే కమర్షియల్ స్టయిల్లో సాగిపోతుంటుంది. ఐతే కార్తీక్ శైలి అది కాదు. అతను వెరైటీ కథలతో ప్రయాణం సాగిస్తుంటాడు. ‘పేట్ట’లో ఇద్దరి స్టయిల్ మిక్స్ అయి ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్దిఖి.. విజయ్ సేతుపతి లాంటి గొప్ప నటులు కీలక పాత్రలు పోషించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. సిమ్రాన్ - త్రిష ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. సన్ పిక్చర్స్ ‘పేట్ట’ను నిర్మించింది.