Begin typing your search above and press return to search.

రజినీకి అక్రమ సంబంధం పెట్టేశారు

By:  Tupaki Desk   |   25 May 2018 11:41 AM IST
రజినీకి అక్రమ సంబంధం పెట్టేశారు
X
రజినీకాంత్ అంటే సౌతిండియా సూపర్ స్టార్. దక్షిణాదిలో మాత్రమే కాదు.. ఆయనపై అభిమానం దేశ సరిహద్దులను కూడా దాటిపోయి చాలా కాలమే అయింది. ఎంతో నిరాడంబరంగా ఉండే ఆయనకు.. చాలా నెమ్మదస్తుడు అని మాత్రమే కాదు.. క్లీన్ ఇమేజ్ కూడా ఉంది. రియల్ లైఫ్ లో కూడా పెద్దగా ఆరోపణలు వినిపించవు.

అలాంటి సూపర్ స్టార్ కు అక్రమ సంబంధం లింక్ తో సినిమా తీస్తే ఎలా ఉంటుంది? అఫ్ కోర్స్.. పెళ్లి తర్వాత లవర్ కూడా ఉండే రోల్ కాబట్టి.. అక్రమ సంబంధం అనే పదం ఉపయోగించాల్సి వచ్చిందంతే. కాలా మూవీలో రజినీ భార్య పాత్రలో ఈశ్వరి రావు నటిస్తోంది. ఈ చిత్రంలో యాక్ట్ చేస్తోన్న మరో హీరోయిన్ హూమా ఖురేషి. రజినీకి లవర్ పాత్రలో ఈమె నటిస్తోంది. భార్య ఉండగానే.. ఈ లవర్ తో కూడా అఫైర్ ఉంటుంది. మరి ఈ క్యారెక్టర్ ను. రిలేషన్ షిప్ ను ఎలా చూపించనున్నారన్నదే ఆసక్తికరమైన పాయింట్.

అన్నిటికంటే ముఖ్యంగా.. ఇలాంటి పాత్రలో రజినీకాంత్ ను చూసి చాలా కాలం అయింది. చివరగా ఎప్పుడు చూశామో గుర్తు చేసుకోవడం కూడా కష్టం. పైగా ఆయన రాజకీయాల్లోకి వస్తున్న తరుణంలో కాలా చిత్రంలో ఇలాంటి పాత్రలో కనిపించడం ప్రత్యర్ధులకు ఓ అస్త్రం చిక్కినట్లే అవుతుంది. మరి ఈ అక్రమ సంబంధం అంశాన్ని సినిమా వరకే వదిలేద్దామా అంటే.. తమిళనాట రాజకీయాలు- సినిమాలు ఎప్పుడో దశాబ్దాలకు పూర్వమే కలిసిపోయాయి. మరి రజినీకాంత్ వీటిని ఎలా డీల్ చేస్తారో!