Begin typing your search above and press return to search.

నా జీవితంలో ఇది బ్లాక్ డే:ర‌జ‌నీకాంత్

By:  Tupaki Desk   |   7 Aug 2018 4:57 PM GMT
నా జీవితంలో ఇది బ్లాక్ డే:ర‌జ‌నీకాంత్
X
రాజకీయ కురువృద్ధుడు - తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి - డీఎంకే అధ్యక్షుడు 'కలైంజర్' కరుణానిధి కొద్ది సేప‌టి క్రితం తుదిశ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. క‌రుణానిధి మ‌ర‌ణ వార్త‌తో త‌మిళ‌నాట విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. క‌రుణ అభిమానులు - డీఎంకే కార్య‌క‌ర్త‌లు శోక సంద్రంలో మునిగారు. సినీ ర‌చ‌యిత అయిన క‌రుణానిధి మృతిప‌ట్ల‌ ప‌లువురు కోలీవుడ్ ప్ర‌ముఖులు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. క‌రుణానిధి మృతికి సంతాపంగా హీరో ర‌జ‌నీకాంత్ - సీనియ‌ర్ న‌టి రాధికా శ‌ర‌త్ కుమార్ ట్వీట్ చేశారు. ఈరోజు త‌న‌ జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని బ్లాక్ డే అని - క‌రుణానిధి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన‌ని ర‌జ‌నీకాంత్ ట్వీట్ చేశారు.

క‌రుణానిధి జ్ఞాప‌కాల‌తో తన మ‌న‌సంతా నిండిపోయింద‌ని రాధికా శ‌రత్ కుమార్ ట్వీట్ చేశారు. తమిళనాడు ప్రజలందరికీ ఈ రోజు బ్లాక్ డే అని, గొప్ప నాయకుడైన కరుణానిధి జ్ఞాపకాలతో త‌న మ‌న‌సు నిండింద‌ని అన్నారు. తమిళ ప్రజలు గర్వపడేలా ఆయ‌న పోరాడార‌న్నారు. భౌతికంగా క‌రుణానిధి త‌మ‌ మధ్య లేకపోయినా.. ఆయన స్ఫూర్తి మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంద‌ని అన్నారు. తమిళ ప్రజలను శోక‌సంద్రంలో విడిచి వెళ్లిపోయిన గొప్ప నాయకుడికి కన్నీటి వీడ్కోలు అని రాధిక శరత్ కుమార్ ట్వీట్ చేశారు. కాగా, రాజకీయాల్లోకి రాకముందు తమిళ సినీ పరిశ్రమలో సంభాషణల రచయితగా క‌రుణానిధి పని చేసిన సంగ‌తి తెలిసిందే. తమిళంలో ఎన్నో కథలు, నాటకాలు, నవలలు రాశారు. తమిళ సాహిత్యానికి క‌రుణ ఎన‌లేని సేవ చేశారు. అందుకే ఆయ‌న‌ను అభిమానులు ముద్దుగా `కలైంగర్` (క‌ళాకారుడు) అని పిలుచుకుంటారు.