Begin typing your search above and press return to search.

నార్త్ కి చుక్కలు చూపించేసిన రజనీ

By:  Tupaki Desk   |   26 July 2016 5:00 PM IST
నార్త్ కి చుక్కలు చూపించేసిన రజనీ
X
నార్త్ ఇండియన్స్ కి.. సౌత్ జనాలంటే బాగా చులకనగా చూడ్డం అలవాటు. మదరాసీలంటూ హేళనగా మాట్లాడే బాపతు కూడా చాలామంది ఉంటారు. ఇవన్నీ మిగతా విషయాల్లో చెల్లుబాటు అవుతాయే కానీ.. సూపర్ స్టార్ రజినీకాంత్ దగ్గర మాత్రం వర్కవుట్ కాలేదు.

లేటెస్ట్ సినిమా కబాలి గురించి అన్ని ఛానల్స్ లో జరిగిన ప్రచారం.. వచ్చిన హైప్ చూస్తే.. ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవాల్సిందే. ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ ఎవరో అర్ధం కావాల్సిందే. ఇక్కడే కాదు.. ఇంటర్నేషనల్ గా కబాలి కోసం ఫ్యాన్స్ చూసిన ఎదురుచూపులు.. రిలీజ్ కి ముందు హంగామా.. ప్రీమియర్ల రికార్డులు.. సాధించిన వసూళ్లు.. మరే స్టార్ హీరోకి సాధ్యం కాదని ఫిక్స్ అయిపోవచ్చు. మిగిలిన విషయాల్లో డామినేషన్ చూపించే బాలీవుడ్ జనాలు.. రజినీ దగ్గరకు వచ్చేసరికి సలాం అనక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.

రజినీకాంత్ కోసం షారూక్ ఖాన్ లుంగీ డ్యాన్స్ చేయడం కూడా ఇందులో ఒకటి. రజినీ విషయంలో సౌత్ నార్త్ అనే తేడాలేం కనిపించవు. ఇంకా చెప్పాలంటే.. వాళ్లొచ్చి ఇక్కడోళ్లను డామినేట్ చేసే ప్రయత్నాలు చేస్తుంటే.. ఎక్కడికి వెళ్లకుండానే ఇక్కడి నుంచే తన సత్తా చూపిస్తున్నాడు సూపర్ స్టార్.