Begin typing your search above and press return to search.

పెట్టాతో సంక్రాంతికి నో ట్ర‌బుల్

By:  Tupaki Desk   |   14 Nov 2018 10:12 AM GMT
పెట్టాతో సంక్రాంతికి నో ట్ర‌బుల్
X
సంక్రాంతి-2019 బ‌రిలో భారీ చిత్రాలు క్యూ క‌డుతున్న సంగ‌తి తెలిసిందే. మెగా ప‌వ‌ర్‌ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్ న‌టిస్తున్న `విన‌య విధేయ రామా` - నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న `క‌థానాయ‌కుడు` చిత్రాలు సంక్రాంతి బ‌రిలో రిలీజ్‌ కి వ‌స్తున్నాయి. విక్ట‌రీ వెంక‌టేష్ - వ‌రుణ్ తేజ్ మ‌ల్టీస్టార‌ర్ `ఎఫ్ 2- ఫ‌న్ అండ్ ఫ్రస్టేష‌న్‌` రిలీజ్ కానుంది. ఇక‌పోతే ఈ సినిమాల‌తో పాటు రేసులో ప‌లు చిన్నా చిత‌కా సినిమాలు ఉన్నాయి. వీటికి పోటీగా ప‌లు భారీ త‌మిళ చిత్రాలు బ‌రిలో దిగుతున్నాయి.

సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన `పెట్టా` చిత్రం సంక్రాంతి బ‌రిలోనే రిలీజ్ కానుంద‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌చార‌మైంది. ఈ సినిమాతో పాటు త‌ళా అజిత్ న‌టిస్తున్న `విశ్వాసం` సంక్రాంతికే రేసులోకి వ‌స్తోంది. ఇద్ద‌రు టాప్ స్టార్లు న‌టించిన సినిమాలే అయినా .. తెలుగులో అజిత్ మార్కెట్ అంతంత మాత్ర‌మే కావ‌డంతో ఆ ప్ర‌భావం తెలుగు సినిమాల‌పై ఉండ‌క‌పోవ‌చ్చ‌న్న చ‌ర్చ సాగుతోంది. ర‌జ‌నీ న‌టించిన 2.ఓ భారీ బ‌డ్జెట్ చిత్రం.. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం మ‌రో 15రోజుల్లో వ‌చ్చేస్తోంది. భారీత‌నం ఉన్న సినిమా కాబ‌ట్టి 2.ఓకి ఉండే క్రేజు వేరు. అయితే ర‌జ‌నీ పెట్టాకు అంత సీన్ ఉండే అవకాశం లేదు.

గ‌త కొంత‌కాలంగా ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న సినిమాలు టాలీవుడ్ లో డిజాస్ట‌ర్లు అవుతున్నాయి. కొచ్చాడ‌యాన్‌ - క‌బాలి - కాలా చిత్రాల వైఫ‌ల్యం ర‌జ‌నీ మార్కెట్ రేంజుని టాలీవుడ్‌ లో పూర్తిగా కిందికి దించేసింది. దీంతో `పెట్టా` వ‌ల్ల సంక్రాంతి కి వ‌స్తున్న తెలుగు సినిమాల‌కు రిస్కేమీ లేద‌న్న మాట వినిపిస్తోంది. ఈలోగానే అస‌లు పెట్టా చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలా వ‌ద్దా? అన్న సందిగ్థ‌త నెల‌కొంద‌ని తెలుస్తోంది. కోలీవుడ్‌ లో ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ‌వుతున్నా తెలుగులో రిలీజ్ విష‌య‌మై ఇంకా సందేహాలు నెల‌కొన్నాయిట‌. ఈ సినిమా వ‌చ్చినా - రాక‌పోయినా ఆ ప్ర‌భావం మాత్రం చ‌ర‌ణ్ - బాల‌య్య‌ - వెంకీ సినిమాల‌పై ఉండ‌క‌పోవ‌చ్చు. ఆ సినిమాల క్రేజు ముందు డ‌బ్బింగ్ సినిమాకు అంత ఉండ‌క‌పోవ‌చ్చ‌న్న మాట వినిపిస్తోంది.