Begin typing your search above and press return to search.

కాలా.. సమాధానాలు చెప్పాలి చాలా

By:  Tupaki Desk   |   6 Jun 2018 10:00 AM IST
కాలా.. సమాధానాలు చెప్పాలి చాలా
X
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా రిలీజంటే మామూలుగా ఓ రేంజిలో హంగామా ఉంటుంది. కానీ లేటెస్ట్ మూవీ కాలా విషయంలో ఇది రివర్సయింది. సినిమా రిలీజు టైం గంటల్లోకి వచ్చేసినా పెద్దగా బజ్ ఉండటం లేదు సరికదా రకరకాల వివాదాలు మూవీని చుట్టుముడుతున్నాయి.

అభిమానులు ఎప్పటి నుంచో కోరుతున్న విధంగా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ఆ పరంగా చూసుకుంటే కాలా సినిమా ఎఫెక్ట్ తక్కువగా అంచనా వేయడానికి ఉండదు. ఇందులో ముంబయిలోని అతిపెద్ద మురికివాడ అయిన ధారావిని శాసించే నాయకుడిగా రజనీ కనిపించనున్నాడు. ఈ సినిమా కథలో రాజకీయపరమైన విషయాలు చాలానే వస్తాయి. వీటిల్లో కొన్ని వివాదాస్పదమైన కామెంట్లు కూడా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. అందుకే కాలా సినిమా సెన్సార్ కు మామూలు కన్నా ఎక్కువ టైం తీసుకున్నారు.

రజనీ పొలిటికల్ అజెండాకు సంబంధించిన చాలా అంశాలను కాలా సినిమాలో ఉంటాయనే మాట కోలీవుడ్ లో వినిపిస్తోంది. సినిమాకు ఇప్పుడు బజ్ లేకపోయినా రిలీజయ్యాక అభిమానుల నుంచి భారీ స్పందన ఉంటుందని కాలా యూనిట్ ఆశిస్తోంది. ఇప్పటికే రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన రజనీ ఈ సినిమా తరవాత కార్యాచరణ ప్రకటిస్తాడని రాజకీయ వర్గాల్లోనూ అంచనాలు ఉన్నాయి. ఆ పరంగా మాత్రం కాలా చెప్పేది చాలానే ఉంటుంది అనుకోవచ్చు.