Begin typing your search above and press return to search.

ఆ రికార్డు కూడా తలైవాకే సొంతం!

By:  Tupaki Desk   |   22 July 2016 8:11 AM GMT
ఆ రికార్డు కూడా తలైవాకే సొంతం!
X

ఆయన గుడ్ విల్ అన్ని కార్పొరేట్ బ్రాండ్ కంటే చాలా ఎక్కువ, దేశంలోని ఏ నాయకుడి కన్నా, స్టార్ కన్నా ఆయనకు ఉన్న విలువ అధికం.. దాన్ని డబ్బుతో ఎవరూకొలవలేరు అని చెబుతున్నారు ముంబైకి చెందిన బ్రాండ్ ఎండార్సర్ అనిర్బన్ బ్లా! ఈ మాటలు ఎవరి గురించో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాం! కబాలి.. రజనీ కాంత్ గురించి. భారతదేశమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా సినిమా జనాలను, సినీ అభిమానులను ఒక ఊపు ఊపుతున్న రజనీ గురించి ఒక ఆసక్తికరమైన అంశంపై తాజాగా చర్చ నడుస్తుంది.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ తో పాటు ఖాన్ల త్రయం షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ లు, టాలీవుడు లో మెగాస్టార్, సూపర్ స్టార్ ల దగ్గరనుండి కన్నడ పునీ రాజ్ కుమార్ వరకూ, కేరలా స్టార్ లు ముమ్ముట్టి, మోహన్ లాల్ లతో కలిపి సుమారు అందరు సూపర్ స్టార్ హీరోలూ, హీరోయిన్ లూ ఏదో ఒక కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్స్ గా పనిచేసినవారే, చేస్తున్నవారే! అయితే ఇప్పటివరకూ రాజనీ మాత్రం ఒక్క కంపెనీకి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయలేదు.

దీనికి కారణం అనిర్బన్ బ్లా చెప్పిందేనా లేక మరేదైనానా అనే విషయం కాసేపు పక్కనపెడితే... నిజంగా రజనీ కాంత్ అనుకుంటే, కనుసైగ చేస్తే.. ఎన్నో బడా కంపెనీలు ఆయనముందు క్యూ కడతాయి. రజనీ అడిగిన మొత్తంలో సమర్పించుకుంటాయి. కాని ఎందుకో కానీ.. రజనీ ఆ విషయంలో ఎప్పుడు ఒప్పుకోలేదు. తాజాగా ఒక కోలా కంపెనీ కూడా రజనీకి 2 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా.. కనీసం వారికి తన అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదట రజనీ. ఈ ఒక్క విషయంతోనే రజనీకి బ్రాండ్ అంబాసిడర్ అవ్వడంపై ఉన్న ఆసక్తి తెలుస్తోంది. సినిమా హిట్ కు, ప్లాప్ కు సంబందం లేకుండా తన 42 ఏళ్ల సినిమా కెరీర్ లో 150కి పైగా చిత్రాలు చేసిన రజనీ ఎప్పటికీ ఇలానే ఉంటారా? లేక ఏదైనా యాడ్ చేస్తారా అనేది వేచి చూడాలి!!