Begin typing your search above and press return to search.

అప్పు కోసం ఆడుతున్న రజినీ, కమల్

By:  Tupaki Desk   |   18 Feb 2016 5:00 PM IST
అప్పు కోసం ఆడుతున్న రజినీ, కమల్
X
సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ - విశ్వనటుడు కమల్ హాసన్ లకు అప్పులేంటి.. అవి తీర్చడం క్రికెట్ ఏంటి అనుకోవచ్చు కానీ.. ఈ వార్త అయితే నిజమే. ఓ అప్పు కోసం వీరిద్దరు కలిసి క్రికెట్ ఆడబోతున్నారు. అయితే అది సొంత అప్పు కాదు.. నడిగర్ సంఘం కోసం చేసిన అప్పు. దశాబ్దాల చరిత్ర ఉన్న నడిగర్ సంఘంకు ఇప్పటివరకూ సొంత బిల్డింగ్ లేదు.

దీన్నే ఎజెండాగా చేసుకుని, తాజాగా జరిగిన ఎన్నిక విశాల్ గ్రూప్ ఘనవిజయం సాధించింది. అదే స్పీడ్ తో చెప్పినట్లుగా బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసేసింది. ప్రస్తుతం నడిగర్ సంఘం దగ్గర 48 లక్షల రూపాయల క్యాష్ బ్యాలెన్స్ ఉంది. ఇది కాక బ్యాంక్ నుంచి 2 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. ఈ అప్పు తీర్చేందుకు, మరింతగా నిధులు సమకూర్చేందుకు గాను ఓ సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్ ప్లాన్ చేశారు. ఏప్రిల్ 10న ఈ మ్యాచ్ నిర్వహించబోతున్నారు. ఈ మ్యాచ్ లో రజినీకాంత్ - కమల్ హాసన్ కూడా భాగం కాబోతున్నారని నడిగర్ సంఘం ప్రకటించింది.

ఇలా ఈ ఇద్దరు దిగ్గజ మహానటులు ఒకచోట కనిపించనుండడం.. ఈ సెలబ్రిటీ మ్యాచ్ కే హైలైట్ కానుంది. మరి ఇద్దరూ చెరో టీంలో ఉంటారా.. ఒకే టీంలో ఉంటారా అన్నది ఇంకా నిర్ణయించలేదు. ప్రస్తుతం రజినీకాంత్ కబాలి, రోబో 2.0 చిత్రాలను చేస్తుండగా.. కమల్ హాసన్ ఓ ద్విభాషా చిత్రాన్ని స్టార్ట్ చేయనున్నారు.