Begin typing your search above and press return to search.

ఆన్‌ లొకేషన్ః రజనీకాంత్ కబాలి

By:  Tupaki Desk   |   26 Aug 2015 10:19 AM IST
ఆన్‌ లొకేషన్ః రజనీకాంత్ కబాలి
X
రజినీకాంత్ కొత్త మూవీ ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీపై చాలా అంచనాలు ఏర్పడ్డాయి. తమిళనాట మాత్రమే కాదు... దేశవ్యాప్తంగా రజినీ కొత్త మూవీపై ఆసక్తి నెలకొంది. ఈ మూవీలో మాఫియా డాన్ గా నటించనున్నారని... కబాలీశ్వరన్ స్ఫూర్తితో కబాలి అనే టైటిల్ పెట్టనున్నారని తప్పితే... తలైవార్ కొత్త మూవీ గురించి మరే వివరాలు బయటకు తెలియడం. రాధికా ఆప్టే సూపర్ స్టార్ కి జంటగా నటించనుంది ఈ సినిమాలో.

కనీసం ఫస్ట్ లుక్ కూడా ఇప్పటివరకూ రిలీజ్ చేయకపోవడంతో... రజనీకాంత్ ఫ్యాన్స్ లో ఆతృత పెరిగిపోతోంది. కొంతమంది అభిమానులు వాళ్లే పోస్టర్స్ తయారుచేసి.. సూపర్ స్టార్ ఎలా ఉండాలో ఊహించేసుకుంటున్నారు. వీటిలో కూడా సూపర్ స్టార్ కొత్త గెటప్ లతో, డిఫరెంట్ గా కనిపిస్తుండడం విశేషం. అయితే... కబాలి చిత్రంలో రజినీ ఎలా కనిపించనున్నారో, ఆయన గెటప్ ఏంటో.. ఓ ఫోటో బైటపెట్టేసింది. ఇది అధికారికంగా లాంఛ్ చేసినది కాదు. రజనీకాంత్ కబాలి షూట్‌ కి సంబంధించిన వర్కును మానిటర్‌ లో చూస్తుండగా... ఎవరో సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల లో పెట్టేశారు.

నల్లటి జుట్టు, తెల్లటి గడ్డంతో కనిపిస్తున్నారు రజనీ. ఇదే గెటప్ తో రజినీకాంత్ కనిపించే అవకాశముంది. ఈ ఫోటో బయటకు రావడంపై యూనిట్ కాస్త సీరియస్ గా ఉంది. పిక్చర్ కు సంబంధించిన డీటైల్స్ బయటకు రాకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు డైరెక్టర్ రంజిత్.