Begin typing your search above and press return to search.
టీజర్ టాక్ః రజనీ యంగ్ స్టైల్.. అదుర్స్!
By: Tupaki Desk | 1 May 2016 11:44 AM ISTసూపర్ స్టార్ మేనియా మొదలైపోయింది. రజినీకాంత్ కొత్త సినిమా ‘కబాలి’ టీజర్ వచ్చేసింది. ముందు చెప్పినట్లే ఈ రోజు సరిగ్గా ఉదయం 11 గంటలకు టీజర్ రిలీజ్ చేశాడు నిర్మాత కలైపులి థాను. నిమిషం నిడివి ఉన్న ‘కబాలి’ టీజర్ మెస్మరైజింగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సూపర్ స్టార్ సరికొత్త అవతారంలో అభిమానుల్ని ఉర్రూతలూగించబోతున్నాడని టీజర్ చూస్తే అర్థమవుతుంది. మిడిల్ ఏజ్డ్ మాఫియా డాన్ గా రజినీ తనదైన శైలిలో అదరగొట్టేశాడు. తెల్లటి గడ్డంలోనూ అత్యంత స్టైలిష్ గా కనిపించి తన ప్రత్యేకత చాటుకున్నాడు రజినీ.
సూపర్ స్టార్ మార్కు స్టైలిష్ నడకతో ఈ టీజర్ మొదలవుతుంది. ఆ తర్వాత ఓ మీటింగ్ హాల్లో ‘‘మీరెందుకన్నా డాన్ అయ్యారు’’ అని అడిగితే.. రజినీ తనదైన స్టయిల్లో నవ్వే సీన్ ఈ టీజర్ కు హైలైట్. ‘‘ఎవడ్రా ఆ కబాలి.. రమ్మని చెప్పురా’’ అంటూ విలన్ పాత్రధారి కిషోర్ అంటే.. ‘‘కబాలి అంటే తమిళ సినిమాల్లోలాగా బొట్టు పెట్టుకుని.. లుంగీ కట్టుకుని.. కబాలి అని పిలవగానే వచ్చి నిలబడి చెప్పన్నా అనే టైపనుకున్నావారా..’’ అంటూ కౌంటర్ ఇచ్చి.. ‘కబాలి...రా’ అంటూ తనదైన స్టయిల్లో డైలాగ్ చెప్పి అదరగొట్టాడు రజినీ. టీజర్ చివర్లో రజినీ 80ల్లో మాదిరి యంగ్ గెటప్ లోనూ కనిపించాడు. రజినీ భార్యగా నటిస్తున్న రాధికా ఆప్టే సంప్రదాయ చీరకట్టులో కనిపించింది. సంతోష్ నారాయణ్ ఎనర్జిటిక్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా టీజర్ కు ప్రత్యేక ఆకర్షణ. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.