Begin typing your search above and press return to search.

రజినీకాంత్ లేటెస్ట్ హెల్త్ బులిటెన్..

By:  Tupaki Desk   |   26 Dec 2020 2:00 PM GMT
రజినీకాంత్ లేటెస్ట్ హెల్త్ బులిటెన్..
X
సూపర్ స్టార్ రజినీకాంత్ సడెన్ గా అస్వస్థతకు గురైన విషయం అందరిలోనూ ఆందోళనకు కారణమైంది. హైదరాబాద్ లో తన సినిమా షూటింగ్ కు వచ్చిన సందర్భంగా ఆయన సినిమా యూనిట్ లోని ఎనిమిది మంది కరోనా బారిన పడ్డారు. దీంతో వెంటనే చిత్రం షూటింగ్ బంద్ అయిపోయింది. ఈ క్రమంలోనే రజినీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. రజినీకాంత్ కు పరీక్షలు చేయగా కరోనా సోకలేదని తేలింది. హైబీపీ కారణంగానే రజినీకాంత్ ఆరోగ్యం దెబ్బతిందని తేలింది.

హైబీపీ కారణంగా హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్ హెల్త్ బులిటెన్ ను వైద్యులు తాజాగా విడుదల చేశారు. రజనీ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఈరోజు చేసిన టెస్ట్ లు అన్నిట్లో ఇబ్బంది కలిగించే అంశాలు ఏమి లేవని పేర్కొంది. ఇంకా కొన్ని రిపోర్ట్స్ రావాల్సి ఉందని రాత్రి రక్త పోటు స్టేటస్ ఆధారంగా రేపు ఉదయం డిస్చార్జ్ చేసే అంశాన్ని పరిశీలిస్తాంమని పేర్కొన్నారు.

రక్త సరఫరాలో హెచ్చు తగ్గులు ఉండడం వల్ల రజినీకాంత్ కు ఈ పరిస్థితి వచ్చింది అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతానికి రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి తెలిపింది .

గత 10 రోజులుగా ‘అన్నాత్తే’ షూటింగ్ కోసం రజనీ ఏకంగా 14 గంటల పాటు పనిచేస్తున్నారు. హైదరాబాద్ లో ఉంటున్నారు. రజినీకాంత్ వెంట కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు. కాగా రజనీ ఆరోగ్యంపై వార్తలు రావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

డిసెంబర్ 31న పార్టీ ప్రకటన నేపథ్యంలో రజినీ అస్వస్థతతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. హైదరాబాద్ అపోలో ఆస్పత్రి వద్దకు అభిమానులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో అపోలో ఆస్పత్రి వద్ద భద్రత పెంచారు. పేషేంట్లను, అటెండర్లను మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నారు.