Begin typing your search above and press return to search.

రజనీ ఫ్యాన్స్‌కి బాహుబలి షాక్‌

By:  Tupaki Desk   |   11 July 2015 7:02 AM GMT
రజనీ ఫ్యాన్స్‌కి బాహుబలి షాక్‌
X
ఇంతవరకూ సౌత్‌లో తొలిరోజు వసూళ్లలో నెం.1 సినిమా ఏది? ఈ ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్‌. సౌత్‌లో టాప్‌-1 హీరోగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పేరునే చెబుతారు ఎవరైనా. అతడికి ఉన్న అభిమాన బలం అలాంటిది మరి. అటు తమిళ్‌, ఇటు తెలుగు, హిందీ ఇతరత్రా భాషల్లో రజనీకి ఉన్న అభిమానుల వల్ల అతడి సినిమాలకు భారీ వసూళ్లు వస్తాయి. అందునా తొలిరోజు రికార్డు బ్రేకింగ్‌లే. ఆ లెక్కన చూస్తే ఇప్పటివరకూ 'లింగా' తొలిరోజు రికార్డుల్లో నెం.1 స్థానంలో నిలిచింది.

ఈ సినిమా తమిళ్‌, తెలుగు వెర్షన్లు కలుపుకుని తొలిరోజు రూ.39కోట్లు వసూలు చేసింది. అయితే ఇన్నాళ్టికి ఈ రికార్డును కొట్టే సినిమా వచ్చింది. రాజమౌళి దర్శకత్వం వహించిన 'బాహుబలి' ఈ రికార్డును కొట్టేసింది. విడుదలైన తొలిరోజే ఈ సినిమా ఒక్క తెలుగు భాషలో 40కోట్లు గ్రాస్‌ వసూలు చేసి సంచలనం సృష్టించినట్లు తెలుస్తోంది. తమిళ్‌, తెలుగు, హిందీ కలుపుకుని ఆ రికార్డ్‌ రూ.60కోట్లు పైమాటే. బాహుబలి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4,300 స్క్రీన్లలో రిలీజైంది. ఈ రికార్డు చూసి రజనీ అభిమానులు షాక్‌కి గురై నోరెళ్లబెడుతున్నారు. ఇప్పట్లో ఏ ఇతర హీరో తిరగరాయలేని రికార్డ్‌ ఇది.