Begin typing your search above and press return to search.

రజినీ సోదరుడిపై అభిమాని అటాక్

By:  Tupaki Desk   |   26 Jun 2016 9:43 AM GMT
రజినీ సోదరుడిపై అభిమాని అటాక్
X
సూపర్ స్టార్ రజినీకాంత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు.. విదేశాల్లో చికిత్స తీసుకుంటున్నట్లు కొన్ని రోజులుగా చెన్నైలో వార్తలు వినిపిస్తున్నాయి. ఐతే ఈ విషయంలో రజినీ కుటుంబ సభ్యులు కానీ.. సన్నిహితులు కానీ క్లారిటీ ఇవ్వట్లేదు. ఐతే అభిమానుల్లో మాత్రం రజినీ ఆరోగ్యం విషయమై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడులోని మధురై జిల్లా రజినీకాంత్ అభిమానుల సంఘం సభ్యుడు శేఖర్.. మధురైలో అంటించిన పోస్టర్లు కలకలం రేపుతుున్నాయి. రజినీ సోదరుడు సత్యానారాయణ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తూ ఆ పోస్టర్లు వేశాడు శేఖర్.

రజనీకాంత్ నటించిన కోచ్చడైయాన్.. లింగా సినిమాలు పరాజయం పాలవడానికి.. రజినీకాంత్ ఆరోగ్యం దెబ్బ తినడానికి ఆయన సోదరుడు సత్యనారాయణే కారణమని ఈ పోస్టర్లో ఆరోపించారు. అంతే కాక గత ఏడాది ఏప్రిల్లో చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో రజినీ క్షేమం కోరుతూ తాను ఓ విషయాన్ని సత్యనారాయణకు చెప్పానని.. కానీ అతను రజనీ కుటుంబ సభ్యుల దృష్టికి ఆ విషయం తీసుకెళ్లలేదని.. అందువల్లే ప్రస్తుతం రజినీ ఇబ్బంది పడుుతున్నాడని అన్నాడు శేఖర్. అప్పుడు జరిగిన తప్పుకు తాను మధురై మీనాక్షి దేవాలయంలో పరిహారం చెల్లించనున్నట్లు వెల్లడించాడు. ఐతే సత్యనారాయణ మీద శేఖర్ తీవ్ర ఆరోపణలు గుప్పించడం.. విమర్శలు చేయడంపై కొందరు రజినీ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.