Begin typing your search above and press return to search.

మలేసియాలో కబాలి టిక్కెట్టు దొరకలేదని...

By:  Tupaki Desk   |   22 July 2016 8:49 AM GMT
మలేసియాలో కబాలి టిక్కెట్టు దొరకలేదని...
X
తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కు ఉన్న అభిమానుల సంఖ్య, వారి అభిమానం స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రజనీ పోస్టర్లకు దండలు వేయడం - థియేటర్ల ను ముస్తాబు చేయడం - కటౌట్ లకు పాలాభిషేకాలు చేయడంలో వారు సిద్ధహస్తులే! అయితే ఈ స్థాయి అభిమానం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా.. ఎవరి ఇష్టం వాళ్లదని సరిపెట్టుకోవచ్చు. ఇంతవరకూ పర్వాలేదు కానీ.. తాజాగా మలేసియాలో ఒక రజనీ అభిమాని చేసిన పని మాత్రం అత్యంత బాదాకరమనే చెప్పాలి!

తాజాగా విడుదలయిన కబాలి సినిమాకు సంబందించి మొట్టమొదటి షోకు టిక్కెట్టు దొరకలేదని మనస్థాపం చెందిన ఒక అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. మలేసియాలోని కేన్ సీసి ప్రాంతలో పది అంతస్తుల భవనం నుంచి కిందికి దూకి ఆ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఈ విషయం సంచలనం రేపింది. కాగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా మలేసియాలో కబాలి సినిమాపై ఆసక్తి, హడావిడీ విపరీతంగా కొనసాగుతుంది. ఈ సినిమా షూటింగ్ కూడా అత్యధిక భాగం అక్కడే జరిగింది!