Begin typing your search above and press return to search.

రజినీకాంత్ మరో కూతురు టార్గెట్

By:  Tupaki Desk   |   11 May 2023 12:33 AM IST
రజినీకాంత్ మరో కూతురు టార్గెట్
X
రెండు నెలల క్రితం రజినీకాంత్‌ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ తన ఇంట్లో రూ.60 లక్షల విలువైన బంగారు ఆభరణాలు పోయాయి అంటూ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన విషయం తెల్సిందే. పోలీసుల ఎంక్వౌరీలో ఇంట్లో పని చేసే వారే దొంగతనంకు పాల్పడ్డట్లుగా నిర్థారణ అయ్యింది. ఇప్పుడు మరో కూతురు ఇంట దొంగతనం జరిగింది.

రజినీకాంత్ చిన్న కూతురు సౌందర్య రజినీకాంత్ తన యొక్క ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ఆ ఫిర్యాదులో తన ఎస్‌యూవీ కారు యొక్క కీ ని పోగొట్టుకున్నట్లుగా ఆమె పేర్కొంది. చెన్నైలోని తేనాంపేట పోలీసు స్టేషన్ లో సౌందర్య రజినీకాంత్‌ ఈ కేసును నమోదు చేశారు.

ఒక ప్రైవేట్‌ కాలేజీ ఫంక్షన్ కు వెళ్లి వచ్చేలోపు తన ఎస్‌యూవీ కారు యొక్క కీ కనిపించడం లేదు అంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా తెలియజేశారు. సౌందర్య రజినీకాంత్‌ కారు యొక్క కీ ని త్వరలోనే కనిపెట్టి ఇస్తామంటూ పోలీసు అధికారులు హామీ ఇచ్చారట.

సూపర్ స్టార్‌ రజినీకాంత్ ఇద్దరు కూతుర్లు ఇలా దొంగతనం విషయంలో వార్తల్లో నిలవడం ఆశ్చర్యంగా ఉంది. అది కూడా చాలా తక్కువ సమయంలోనే ఇలా ఒకరి తర్వాత ఒకరు టార్గెట్ అవ్వడం పట్ల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ఈ వయసు లో వరుసగా సినిమాలు చేస్తూ ఉండగా.. ఆయన కూతుర్లు ఇలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం దారుణం.