Begin typing your search above and press return to search.

మళ్లీ తాత అయిన సూపర్ స్టార్‌

By:  Tupaki Desk   |   12 Sep 2022 8:42 AM GMT
మళ్లీ తాత అయిన సూపర్ స్టార్‌
X
సూపర్ స్టార్‌ రజినీకాంత్ మరోసారి తాత అయ్యాడు. ఇప్పటికే ఆయన తాత అయ్యాడు.. నిన్న మరోసారి తన కూతురు సౌందర్య రజినీకాంత్ కొడుకుకి జన్మనివ్వడం తో రజినీకాంత్ మళ్లీ తాత అయ్యాడు. తమిళ మీడియాలో రజినీకాంత్ కి మనవడు పుట్టాడు అంటూ పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి.

సౌందర్య రజినీకాంత్‌ స్వయంగా తాను మరోమారు తల్లి అయ్యాను అంటూ చాలా సంతోషంగా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. కొడుకు జన్మించినట్లుగా సౌందర్య సోషల్‌ మీడియా లో తెలియజేయడంతో రజినీకాంత్‌ అభిమానులు పెద్ద ఎత్తున ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

గతంలోనే సౌందర్య ఒక బాబుకు జన్మనిచ్చింది. నిన్న పుట్టిన తన కొడుకుకి వీర్‌ రజినీకాంత్ వనంగమూడి అనే పేరును పెట్టినట్లుగా కూడా అప్పుడే అధికారికంగా ప్రకటించింది. మేము ముగ్గురం కూడా మా కుటుంబంలోకి వీర్ రావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నామని ట్వీట్‌ లో పేర్కొంది.

రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్‌ కి ఇద్దరు కొడుకులు కాగా.. సౌందర్య రజినీకాంత్‌ కు కూడా ఇద్దరు కుమారులు జన్మించారు. మొత్తంగా రజినీకాంత్ కి నలుగురు మనుమళ్లు అయ్యారు. ఆ నలుగురిలో ఎంత మంది రజినీకాంత్‌ వారసత్వంతో ఇండస్ట్రీలో అడుగు పెడతారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.