Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ పద్మ విభూషణ్..

By:  Tupaki Desk   |   12 April 2016 3:30 PM GMT
సూపర్ స్టార్ పద్మ విభూషణ్..
X
సౌతిండియా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా పద్మ విభూషణ్‌ అవార్డు అందుకున్నారు. దీంతో ఆయన ఫ్యామిలీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. అభిమానుల కోలాహలం అయితే మాములుగా లేదు. కుటుంబసభ్యులు తమ సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా రజినీ అభిమానులతో పంచుకుంటున్నాన్నారు. రజినీకాంత్ కుమార్తెలతోపాటు అల్లుడు ధనుష్‌ ట్విట్టర్‌ వేదికగా తమ అభినందనలు, ఆనందం తెలిపారు.

తండ్రికి పద్మ పురస్కారం అందడంపై రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య ధనుష్‌ ఆనందం వ్యక్తం చేస్తూ.. ట్వీట్‌ చేసింది. ఇక చిన్న కుమార్తె సౌందర్య అయితే స్టైల్‌ కింగ్‌, రజనీకాంత్‌... పద్మవిభూషణ్‌ అంటూ తల్లిదండ్రులిద్దరూ కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. కృషి, పట్టుదల, వినయంతోనే జీవితంలో ఈ స్థాయికి రజినీకాంత్ ఎదిగారంటూ.. అల్లుడు- తమిళ నటుడు ధనుష్‌ ట్వీట్‌ చేశాడు. ఇక కోలీవుడ్ నుంచి కూడా రజినీకాంత్ కు అభినందనలు వెల్లువెత్తాయి.

"బస్‌ కండక్టరు నుంచి పద్మ విభూషణ్‌ స్థాయికి రజనీకాంత్‌ ఎదిగార'ని సంగీత దర్శకుడు అనిరుధ్‌ ట్వీట్‌ చేశారు. రజినీకాంత్ పద్మ విభూషణ్ అందుకున్న ఈ సమయం.. అందరూ గర్వించదగ్గది అంటూ అలనాటి నటి రాధిక.. ట్వీట్‌ చేశారు. సూపర్ స్టార్ కు దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం రావడం.. కోలీవుడ్ ని సంబరాల్లో ముంచెత్తింది.