Begin typing your search above and press return to search.

అమెరికా ఫిలిం ఫెస్ట్ లో బాషా!!

By:  Tupaki Desk   |   19 Sept 2017 12:01 PM IST
అమెరికా ఫిలిం ఫెస్ట్ లో బాషా!!
X
రజినీకాంత్ నటించిన బాషా మూవీ పేరు చెప్పగానే.. చాలామంది సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఒంటిపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇండియన్ సినిమా స్క్రీన్ ప్లే తీరుతెన్నులను మార్చేసిన సినిమాగా బాషాను చెప్పాలి. ఇప్పటికీ ఈ బాషా స్క్రీన్ ప్లే ప్రభావం నుంచి సౌత్ సినిమా బయటపడలేదు. పాతికేళ్ల క్రితం వచ్చిన ఈ అద్భుత చిత్రంలో.. ఆటో డ్రైవర్ గా.. ముంబై అండర్ వరల్డ్ డాన్ గా విభిన్న గెటప్ లలో రజినీ కనిపిస్తారు.

రీసెంట్ గా ఈ బాషాకు డిజిటల్ వెర్షన్ ను కూడా రిలీజ్ చేశారు. దీనికి కూడా అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించింది. అయితే.. ఈ డిజిటల్ బాషాను యూఎస్ లో జరగనున్న ఫెంటాస్టిక్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబోతున్నారు. సెప్టెంబర్ 21 నుంచి 28 వరకూ యూఎస్ లో 12వ ఫెంటాస్టిక్ ఫెస్ట్ జరగనుంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించిన.. గుర్తింపు పొందిన పలు భాషలకు చెందిన చిత్రాలను ప్రదర్శిస్తారు. హారర్.. ఫ్యాంటసీ.. సైంటిఫిక్ ఫిక్షన్.. యాక్షన్ తో పాటు అద్భుతం అనిపించిన సాధారణ చిత్రాలు కూడా ఉంటాయి.

గతేడాది ఈ ఫెంటాస్టిక్ ఫెస్ట్ లో కమల్ హాసన్ నటించిన థ్రిల్లర్ మూవీ ఆలవందన్(తెలుగులో అభయ్) ను ప్రదర్శించగా.. ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ ఏడాది బాషా కు కూడా యూఎస్ ఆడియన్స్ నుంచి ఆదరణ లభిస్తుందని చెప్పవచ్చు. సురేష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ బాషా చిత్రం తర్వాత.. రజినీ డాన్ గెటప్ అంటేనే విపరీతమైన క్రేజ్ క్రియేట్ అయ్యే పరిస్థితి నెలకొంది. రీసెంట్ గా కబాలికి కూడా బాషా క్రేజ్ బాగా హెల్ప్ అయింది.