Begin typing your search above and press return to search.
రంగంలోకి దిగిన రజనీకాంత్!
By: Tupaki Desk | 26 April 2019 5:05 PM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య ఈమధ్యే బిజినెస్ మ్యాన్ విశాగన్ వనంగమూడిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సౌందర్యకు ఇది రెండో వివాహం. ఈ విశాగన్ వ్యాపారవేత్త మాత్రమే కాదు.. సినీరంగంలో హీరోగా సత్తా చాటాలనే కోరిక కూడా ఉందట. సౌందర్యతో వివాహానికి మునుపే ఒక సినిమాలో కూడా నటించాడు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయింది.
ఇప్పుడు ఎలాగూ సూపర్ స్టార్ అల్లుడు కాబట్టి తన ప్రయత్నాలు గట్టిగా చేయాలని నిర్ణయించుకున్నాడట. ఇప్పటికే మామగారికి తన కోరిక తెలిపాడని.. అందుకు అంగీకరించిన రజనీ తనవైపునుండి విశాగన్ కు సపోర్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడని సమచారం. ఈమధ్యే తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ను పిలిపించి మాట్లాడారట. చిన్నల్లుడు హీరోగా ఒక సినిమా తెరకెక్కించాలని కార్తీక్ ను కోరారట. సంక్రాంతికి రిలీజ్ అయిన 'పేట' సినిమాకు కార్తీక్ దర్శకుడనే సంగతి తెలిసిందే.
కార్తీక్ తో ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా అల్లుడు నిలదొక్కుకునేవరకూ మంచి ప్రాజెక్టులు సెట్ చేయాలనే ఆలోచనలో రజనీ ఉన్నారట. రజనీ స్వయంగా సూపర్ స్టార్. పైగా పెద్దల్లుడు ధనుష్ కూడా పెద్ద స్టార్ కాబట్టి చిన్నల్లుడు విశాగన్ కు కోలీవుడ్ లో పెద్దగా ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.