Begin typing your search above and press return to search.

వయసైపోయిన గ్యాంగ్‌స్టర్‌.. బాషాయేనా?

By:  Tupaki Desk   |   14 July 2015 4:44 PM IST
వయసైపోయిన గ్యాంగ్‌స్టర్‌.. బాషాయేనా?
X
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఆల్‌టైమ్‌ హాట్‌ టాపిక్‌. అతడు ఓ సినిమాలో నటిస్తున్నాడు... అంటే బోలెడన్ని స్పెక్యులేషన్స్‌ క్యూ కడతాయి. రజనీ నటించే తర్వాతి సినిమా ఎలా ఉండబోతోంది? కథేమిటి? దర్శకుడెవరు? వంటి ఆసక్తి అందరిలో సహజం. అయితే రంజిత్‌ అనే కుర్రదర్శకుడికి ఛాన్సిచ్చి రజనీ భలే షాకిచ్చారు. కోలీవుడ్‌లో దీనిగురించే ఆల్‌ టైమ్‌ డిస్కషన్‌.

కళైపులి ఎస్‌.థాను నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రంజిత్‌ ఇప్పటికే షెడ్యూల్స్‌ పక్కాగా ప్లాన్‌ చేశాడు. ఆగస్టు 2 నుంచి సెట్స్‌కెళుతున్నారు. ఆరంభం నెలరోజుల పాటు మలేషియాలో తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయ్యాక 20రోజుల పాటు చెన్నయ్‌లో షూటింగ్‌ చేస్తారు. అన్బు, అరివు అనే ఇద్దరు ఫైట్‌ మాస్టర్లను ఎంపిక చేసుకున్నారు. కథానాయికను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఈ చిత్రంలో రజనీ పాత్ర గురించిన ఆసక్తికర చర్చ సాగుతోందిప్పుడు. కోలీవుడ్‌ మీడియాలో ఇదో హాట్‌ టాపిక్‌.

ఈ చిత్రంలో రజనీ ఓ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నాడు. వయసులో కాస్త పెద్దవాడైన గ్యాంగ్‌ స్టర్‌ అన్నమాట. రజనీ కెరీర్‌ని తరచి చూస్తే అతడు గ్యాంగ్‌స్టర్‌గా నటించిన సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌. దళపతి, బాషా చిత్రాల్లో కామన్‌మేన్‌లా కనిపించే గ్యాంగ్‌స్టర్‌. ఇప్పుడు బాషాకి సీక్వెల్‌ ఏమైనా తీస్తున్నాడా? అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా ప్రస్తుతానికి ఇదో సస్పెన్స్‌. 2016 లో శంకర్‌ దర్శకత్వంలో రోబో 2 సెట్స్‌కెళుతుందని తెలుస్తోంది.