Begin typing your search above and press return to search.

'అరుణాచలం' మళ్లీ వస్తున్నాడు.. ఫ్యాన్స్ కు పండుగే..!

By:  Tupaki Desk   |   23 Oct 2022 5:37 AM GMT
అరుణాచలం మళ్లీ వస్తున్నాడు.. ఫ్యాన్స్ కు పండుగే..!
X
సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళులకు ఆరాధ్య నటుడు. ఆయన చేసిన సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ ఎక్కడ లేని హంగామా చేస్తుంటారు. ఇప్పుడంటే వయస్సు పైబడటంతో ఏడాదికి ఒకటి అర సినిమాలు చేస్తున్నారు. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద రజనీ సత్తా ఏమాత్రం తగ్గడం లేదు.

దశబ్దం క్రితం వరకు పరిస్థితులు వేరేలా ఉన్నాయి. రజనీకాంత్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఏడాదికి ఒకటి అర డజను సినిమాలు చేసేవారు. ఏడాదిలో నాలుగైదు బ్లాక్ బస్టర్స్ ఉండేవి. అంతలా తమిళ ప్రేక్షకులను రజనీ మెస్మరైజ్ చేసేవారు. రజనీకాంత్ నటించిన సినిమాల్లో 'అరుణాచలం' ఒకటి.

1997లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో తమిళ బాక్సాఫీస్ తో టాలీవుడ్ ను కలెక్షన్ల పరంగా షేక్ చేసింది. ఈ సినిమా అంటే తలైవా ఫ్యాన్స్ కు ఎంతో ఇష్టం. కాగా ఇప్పటి వరకు ఈ మూవీ పాత ప్రింట్ మాత్రమే సన్ నెట్ వర్క్ వద్ద ఉండేది. తాజాగా 'అరుణాచలం' మాస్టర్ ప్రింట్ ను సన్ టీవీ రెడీ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

దీపావళి కానుకగా 'అరుణాచలం' చిత్రాన్ని సన్ టీవీలో ప్రసారం చేయనున్నట్లు ప్రకటించారు. ఈనేపథ్యంలో 'అరుణాచలం'కు సంబంధించి యాడ్స్ తో సన్ టీవీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఫ్యాన్స్ సైతం వీటిని రీ ట్వీట్ చేస్తుండటంతో 'అరుణాచలం' మూవీ మరింత హైప్ వస్తోంది.

కాగా 'అరుణాచలం' తమిళ వర్షన్ ఒరిజనల్ ప్రింట్ కొన్నాళ్లుగా అందుబాటులో లేకుండా పోయింది. గత పదకొండేళ్ళ క్రితం సన్ టీవీలో ఈ మూవీ వచ్చాక రెన్యూవల్ చేసుకోవడంలో ఆలస్యం జరిగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ ఎక్కడా అందుబాటులోకి లేకుండా పోయింది.

కొన్నాళ్లు ఫ్యాన్స్ చేస్తున్న రిక్వెస్ట్ తో ఎట్టకేలకు సన్ టీవీ 'అరుణాచలం' మాస్టర్ ప్రింట్ ను రెడీ చేసి దీపావళి కానుకగా విడుదల చేస్తోంది. ఇదే తరహాలో గతంలో పడయప్పా(నరసింహ) మూవీని సన్ టీవీ స్పెషల్ ప్రీమియర్ చేస్తే ఏకంగా 22 టీఆర్పీ వచ్చింది. కొత్త సినిమాలకే ఈ స్థాయి రేటింగ్ రావడం లేదు.

ఈ మూవీ తమిళ, తెలుగు వర్షన్ టీవీలో ప్రసారమై చాలారోజులు అవుతోంది. దీంతో ఈ సినిమాకు భారీ టీఆర్పీ వస్తోందని సన్ టీవీ భావిస్తోంది. సోషల్ మీడియాలో తలైవా ఫ్యాన్స్ హంగామా చూస్తుంటే 'పడయప్పా' రికార్డును 'అరుణాచలం' బ్రేక్ చేసేలా కన్పిస్తోంది.