Begin typing your search above and press return to search.

రజినీ.. నాగ్‌.. శ్రీదేవిలు రంగీలాకు నో చెప్పారట!

By:  Tupaki Desk   |   19 Sep 2020 7:50 AM GMT
రజినీ.. నాగ్‌.. శ్రీదేవిలు రంగీలాకు నో చెప్పారట!
X
ఇండియన్‌ సినీ చరిత్రలో కొన్ని ఎప్పటికి నిలిచి పోయే సినిమాలు ఉంటాయి. వాటిలో ఒకటి 'రంగీల' అనడంలో ఎలాంటి సందేహం లేదు. మన రామ్ గోపాల్‌ వర్మ ఈ సినిమాను హిందీలో ఊర్మిళ.. అమీర్‌ ఖాన్‌.. జాకీ ష్రాఫ్‌ లతో తెరకెక్కించాడు. సినిమా వచ్చి మొన్నటి 8వ తారీకుకు 25 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా కూడా ఆన్‌ లైన్‌ ద్వారా మాట్లాడుకోవడం.. మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడంతో పాటు ఒక ఆన్‌ లైన్‌ లో ఒక పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్బంగా హీరోయిన్‌ ఊర్మిళ మాట్లాడుతూ.. మొదట ఈ సినిమా కోసం రజినీకాంత్‌.. నాగార్జున.. శ్రీదేవిలను వర్మ సంప్రదించారు. వారు నో చెప్పిన తర్వాత జాకీ ష్రాఫ్‌.. అమీర్‌ ఖాన్‌ నా వద్దకు ప్రాజెక్ట్‌ వచ్చిందని చెప్పుకొచ్చింది. సౌత్‌ లో నాగార్జున రంగీలా చేయాలనుకున్నాడేమో. అయితే అప్పటికి సౌత్‌ ప్రేక్షకులకు ఆ సినిమా ఎక్కదని రజినీకాంత్‌.. నాగార్జునలు భావించి ఉంటారు. శ్రీదేవి రంగీల పాత్రకు ఆసక్తి చూపించినా కూడా ఏదో కారణం వల్ల ఆ సినిమాను చేయలేక పోయిందనే టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి రంగీలా సినిమాతో జాకీ ష్రాఫ్‌.. అమీర్‌ ఖాన్‌.. ఊర్మిలలు ఇద్దరు కూడా టాప్‌ స్టార్స్‌ గా మారిపోయారు.