Begin typing your search above and press return to search.
మళ్లీ 26 ఏళ్ల తర్వాత ఆ కాంబో వస్తోంది
By: Tupaki Desk | 25 Nov 2017 3:47 PM GMTఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఒకప్పుడు వచ్చిన కొన్ని బారి మల్టి స్టారర్ సినిమాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా మణిరత్నం దర్శకత్వంలో సౌత్ సూపర్ స్టార్ రజినీ కాంత్ మలయాళీ స్టార్ మమ్ముట్టి కలిసి దళపతి అనే ఒక భారీ మల్టి స్టారర్ సినిమా చేశారు. 1991 లో క్రైమ్ థ్రిల్లర్ తరహాలో తెరకెక్కిన ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఆ కాంబినేషన్ కి మంచి గుర్తింపు కూడా దక్కింది.
కాని ఆ తరువాత మళ్లీ రజినీకాంత్ అండ్ మమ్ముట్టి కలిసి నటించలేదు. ఆ మధ్యలో కొన్ని రూమర్స్ చాలా వచ్చినా అవి అప్పుడే మాయమైపోయాయి. అయితే మళ్లీ 26 ఏళ్ల తర్వాత ఆ హిట్ కాంబినేషన్ రిపీట్ కావడానికి అంతా సిద్ధమవుతోంది. మరాఠి భాషలో దీపక్ బావే ఆ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. పసాయడాన్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఇక నిర్మాతగా బాలకృష్ణ అనే ఒక నార్త్ రాజకీయవేత్త వ్యవహరిస్తున్నడని తెలుస్తోంది. మొత్తానికి కథ కూడా సిద్ధమైంది. రీసెంట్ గా ఇద్దరు హీరోలు కూడా స్క్రిప్ట్ ను ఫైనల్ చేశారట. ఇక దర్శక నిర్మాతలు ప్రీ ప్రొడక్షన్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టాక్
ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రజినీకాంత్ మరాఠీ భాషకీ చెందినవారే అని అందరికి తెలిసిందే. కానీ ఆ భాషలో ఆయన ఇన్నేళ్లకి మొదటి సినిమా చేయడం విశేషం. మరి ఆ సినిమా ఎంతవరకు సెట్సీ మీదకు వెళ్లి.. ఎలా రూపొందుకొని.. ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి.