Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ మళ్ళీ అమెరికా జంప్

By:  Tupaki Desk   |   27 April 2018 12:57 PM IST
సూపర్ స్టార్ మళ్ళీ అమెరికా జంప్
X
సూపర్ స్టార్ రజినీకాంత్ కు వయసు రీత్యా వచ్చిన అనారోగ్యాలపై చెకప్ ల కోసం తరచుగా అమెరికా వెళుతుంటారు. సహజంగా ప్రతీ సమ్మర్ కూ అమెరికా విజిట్ చేయడం ఆయనక ఈ మధ్య అలవాటు అయిపోయింది. ఒకవైపు వేసవి వేడి నుంచి తప్పించుకోవడం.. మరోవైపు హెల్త్ చెకప్ లను కూడా పూర్తి చేయడం.. రెండు విధాలుగా తన ట్రిప్ ఉపయోగపడేలా చేసుకుంటూ ఉంటారు రజినీ.

ఈ సమ్మర్ లో కూడా ఆయన అమెరికా వెళతారనే టాక్ ముందు నుంచి ఉంది. ఇప్పుడది కన్ఫాం కావడమే కాదు.. ఇప్పటికే రజినీ అమెరికాలో వాలిపోయారు కూడా. అక్కడి ఎయిర్ పోర్టులో రజినీకాంత్ ఉన్న పిక్స్ ఇప్పుడు వైరల్ గా స్ప్రెడ్ అవుతున్నాయి. టీ షర్టులో రజినీకాంత్ సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. ఏమాత్రం మేకప్ వేసుకోకపోయినా.. ఆ గెడ్డం.. ఆ టీ షర్టు.. క్యాజువల్ ట్రౌజర్ లో రజినీకాంత్ స్టైల్ ను చూసి.. ఇందుకు కదా రజినీని అందరూ సూపర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకునేది అనిపించక మానదు. ఏజ్ ఎంతగా పెరుగుతుంటే ఆయన స్టైల్ కూడా అంతగా పెరిగిపోతుండడం విశేషం.

ఇక రజినీకాంత్ సినిమాల విషయానికి వస్తే.. జూన్ 7వ తేదీన పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన కాలా కరికులన్ రిలీజ్ కానుంది. ఈ చిత్రం ఇవాళే రిలీజ్ కావాల్సి ఉంది కానీ.. తమిళనాట బంద్ కారణంగా కాలా వాయిదా పడింది. మరోవైపు శంకర్ దర్శకత్వంలో రూపొందిన 2.ఓ చిత్రానికి గ్రాఫిక్ వర్క్ పనులు చకచకా జరుగుతున్నాయి.