Begin typing your search above and press return to search.

ర‌జ‌నీకాంత్ మ్యారేజ్ డే.. భావోద్వేగానికి గురైన కూతురు!

By:  Tupaki Desk   |   27 Feb 2021 11:00 AM IST
ర‌జ‌నీకాంత్ మ్యారేజ్ డే.. భావోద్వేగానికి గురైన కూతురు!
X
త‌మిళ్ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ వైవాహిక జీవితంలోకి ప్ర‌వేశించి 40 సంవత్సరాలు పూర్త‌య్యాయి. సతీమణి లతతో ఫిబ్రవరి 26న ఏడడుగులు వేశారు రజనీ. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని ర‌జ‌నీ కూతురు ఐశ్వ‌ర్య‌.. భావోద్వేగానికి లోనయ్యారు. త‌న త‌ల్లిదండ్రుల వివాహ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా.. సోష‌ల్ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్ పెట్టారు.

‘ఆమె అందర్నీ తన కుటుంబంలా భావించింది.. ఆయన ఆమె కుటుంబాన్ని తన కుటుంబం అనుకున్నాడు. ఇద్దరూ కలిసి ఒక మంచి కుటుంబం ఏర్పడటానికి కారణం అయ్యారు’ అని రాసుకొచ్చింది. ఇంకా.. ‘ఒక విజయవంతమైన వైవాహిక జీవితానికి గల కారణాలను మా అమ్మా నాన్న జీవితాలను చూసి తెలుసుకున్నాను. జీవితం అనే ప్రతి మలుపులోనూ మా గ్రాండ్‌ పేరెంట్స్ దేవదూతల్లా ఈ ఇద్దర్నీ కాపాడుకుంటూ వస్తున్నారని నేను న‌మ్ముతున్నా.’ అని ఉద్వేగానికి లోనయ్యారు ఐశ్వర్య.

త‌న ఫీలింగ్స్ ను ఇంకా ఇలా రాశారు. ‘మ్యారేజ్‌ అంటే ఒకరి బాధ్యతని మరొకరు మోయడం అనే విషయాన్ని అమ్మానాన్నని చూసే తెలుసుకున్నాను. ఒక బంధం బలపడటానికి భార్యాభర్తల మధ్య ఉండే స్నేహం కారణమవుతుందనే విషయం అర్థమైంది. వ్యక్తులుగా ఎదిగే ప్రతిదశలోనూ జీవితానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని నేర్చుకుంటూ, జీవితానికి అర్థం తెలుసుకుంటాం. అప్పా, అమ్మా మీ ఇద్దరికీ సూపర్‌ డూపర్‌ మ్యారేజ్‌ యానివర్సరీ శుభాకాంక్షలు’ అని ముగించింది ఐశ్వర్య. కాగా.. రజనీకాంత్ - లత 1981 ఫిబ్రవరి 26న ఒక్కటయ్యారు. వీరికి ఐశ్వర్య‌, సౌందర్య అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఐశ్వర్య ప్రముఖ హీరో ధనుష్‌ని వివాహమాడిన సంగ‌తి తెలిసిందే.