Begin typing your search above and press return to search.

ప్ర‌త్యేక విమానంలో అమెరికాకు ర‌జ‌నీ.. అభిమానుల ఆందోళ‌న

By:  Tupaki Desk   |   14 Jun 2021 7:00 PM IST
ప్ర‌త్యేక విమానంలో అమెరికాకు ర‌జ‌నీ.. అభిమానుల ఆందోళ‌న
X
త‌మిళ్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఇవాళ మ‌ధ్యాహ్నం స్పెష‌ల్ ఫ్లైట్లో అమెరికా వెళ్లారు. దీంతో.. త‌లైవా మ‌ళ్లీ అనారోగ్యానికి గుర‌య్యార‌ని, ఈ కార‌ణంగానే అత్య‌వ‌స‌రంగా ప్ర‌త్యేక విమానంలో అమెరికా బ‌య‌ల్దేరారంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది. ఇది తెలుసుకున్న అభిమానులు.. తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

అయితే.. ఇందులో వాస్త‌వం లేద‌ని తెలిసింది. రెగ్యుల‌ర్ మెడిక‌ల్ చెక‌ప్ కోస‌మే ర‌జ‌నీ అమెరికా బ‌య‌ల్దేరారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం 14 సీట్లు క‌లిగిన ప్ర‌త్యేక విమానంలో చెన్నై నుంచి యూఎస్ ప‌య‌న‌మ‌య్యారు. ప్ర‌స్తుత క‌రోనా కండీష‌న్లో విదేశీ ప్రయాణాల‌పై ఆంక్ష‌లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌త్యేక విమానంలో బ‌య‌ల్దేరారు. కొన్ని రోజుల కింద‌టే వెళ్లడానికి సిద్ధ‌మైన ర‌జ‌నీ.. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి కోసం వేచిఉన్న‌ట్టు స‌మాచారం. ప‌ర్మిష‌న్ వ‌చ్చినందువ‌ల్ల ఇవాళ ప్ర‌యాణమైన‌ట్టు తెలుస్తోంది.

ఇప్ప‌టికే.. అల్లుడు ధ‌నుష్, కూతురు అమెరికాలో ఉన్నారు. ఓ హాలీవుడ్ చిత్రంలో ధ‌నుష్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అక్క‌డికి వెళ్తున్న ర‌జ‌నీ.. హెల్త్ చెక‌ప్ త‌ర్వాత కొన్ని రోజులు అక్క‌డే ఉండి రిలాక్స్ అయిన త‌ర్వాత తిరిగి రానున్న‌ట్టు స‌మాచారం.

కాగా.. ‘అన్నాత్తే’ షూటింగ్ స‌మ‌యంలో హైదరాబాద్ లో ఉండ‌గానే.. ర‌జ‌నీ తీవ్ర అనారోగ్యానికి గురైన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత రాజ‌కీయాల నుంచి శాశ్వ‌తంగా వైదొలుగుతున్న‌ట్టు ప్ర‌క‌టించిన ర‌జ‌నీ.. చాలా కాలం విశ్రాంతి తీసుకున్నారు. ఆ త‌ర్వాత తిరిగి అన్నాత్తే సెట్లో అడుగు పెట్టారు. ఈ చిత్రాన్ని వ‌చ్చే దీపావ‌ళి సంద‌ర్భంగా రిలీజ్ చేయ‌బోతున్నారు.