Begin typing your search above and press return to search.

రజనీ ఇంట గ్రాండ్ గా దీవాళి..థౌజండ్ వాలా పేల్చిన తలైవా

By:  Tupaki Desk   |   15 Nov 2020 3:45 AM GMT
రజనీ ఇంట గ్రాండ్ గా దీవాళి..థౌజండ్ వాలా పేల్చిన తలైవా
X
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా రోజుల తర్వాత కనిపించి ఫ్రాన్స్ కి పండుగ సందడి తెచ్చాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా దీవాళి వేడుకలు జరుపుకున్నారు. తమిళ సాంప్రదాయ దుస్తులు ధరించి చిన్నపిల్లాడిలా థౌజండ్ వాలా కాల్చుతూ హుషారుగా కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రజనీకాంత్ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన పండుగ సందర్భంగా టపాసులు కాల్చుతూ ఉత్సాహంగా కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పండుగనాడు రజనీకాంత్ భార్య లత, కుమార్తె సౌందర్య, అల్లుడు, మనవడితో కలిసి టపాసులు కాల్చి సందడి చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను రజనీ కుమార్తె సౌందర్య సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. తలైవా అభిమానులు ఈ ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు.రజనీ ఈ ఫొటోల్లో క్రాకర్స్ కలుస్తూ థౌజండ్ వాలా కాలుస్తూ సందడిగా కనిపించాడు.కోవిడ్ విజృంభణతో కొద్ది రోజులుగా రజనీకాంత్ ఇంటికే పరిమితమయ్యారు. రాజకీయ పార్టీ స్థాపన కూడా వాయిదా వేశారు. అసలు పార్టీ స్థాపించాలా వద్దా అనే విషయమై అభిమానులతో సర్వే చేస్తున్నారు. ప్రస్తుతం రజనీ విశ్వాసం ఫేమ్ శివతో అన్నాత్తే అనే సినిమాలో నటిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది.