Begin typing your search above and press return to search.
పన్నెండేళ్ల తర్వాత మళ్లీ రోబో జోడీ
By: Tupaki Desk | 7 Jun 2022 7:23 AM GMTఓ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే అందులో నటించిన జోడీ మళ్లీ కలిసి సినిమా చేస్తే బాగుంటుంది కదా అని ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిని చూపిస్తారు. అలాంటి జోడీ కోసం ఎదురుచూస్తుంటారు. సరిగ్గా ఇదే తరహాలో తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్, ఐశ్వర్యారాయ్ ల కోసం కూడా ప్రేక్షకులు, అభిమానులు గత కొన్నేళ్లుగా ఆశగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరు తొలిసారి కలిసి నటించిన చిత్రం 'రోబో'. ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ టెక్నికల్ వండర్ 2010లో విడుదలై తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సంచలన విజయాన్ని సాధించింది.
ఈ మూవీలో రజనీ - ఐష్ ల కెమిస్ట్రీ, ఇద్దరి మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో మళ్లీ వీరిద్దరు కలిసి ఎప్పుడెప్పుడు నటిస్తారా? అని గత కొన్నేళ్లుగా అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా వీరి ఎదురుచూపులకు తెరదించుతూ సన్ పిక్చర్స్ గుడ్ న్యూస్ చెప్పింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ కళానిథి మారన్ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
'బీస్ట్' ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 169వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించబోతున్నారు. భారీ స్థాయిలో తెరపైకి రానున్న ఈ మూవీలో రజనీకి జోడీగా ఐశ్వర్యారాయ్ నటించబోతోంది. ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీలోని ఓ కీలక పాత్రలో నీలాంబరి రమ్యకృష్ణ నటించనుంది.
మరో హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ కూడా ఈ మూవీలో నటించనుందని తెలిసింది. ఇటీవల రజనీకాంత్ తో 'అన్నాత్తే' మూవీని నిర్మించిన సన్ పిక్చర్స్ కు ఆ సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చింది.'సిరుతై' శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ భారీ అంచనాలతో తమిళ, తెలుగు భాషల్లో విడుదలై డిజాస్టర్ అనిపించుకుంది. దీంతో రజనీకాంత్ కు భారీ విజయాన్ని అందించాలన్న లక్ష్యంతో మరో ప్రాజెక్ట్ ని తాజాగా ప్రకటించారు. అయితే ఇదే సంస్థ ఇటీవల విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో నిర్మించిన 'బీస్ట్' ఆశించిన ఫలితాన్ని అందించలేక పోయింది.
అదే దర్శకుడితో రజనీ మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తుండంతో ఫ్యాన్స్ కొంత నిరుత్సాహానికి గురవుతున్నారట. తాజాగా ఫ్లాప్ ని చూసిన దర్శకుడితో రజనీ సినిమా ఏంటీ? అని కామెంట్ లు చేస్తున్నారట. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించబోతున్నారు. సరికొత్త నేపథ్యంలో తెరపైకి రానున్న ఈ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ లో సమ్మర్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్ పిక్చర్స్ వర్గాలు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది.