Begin typing your search above and press return to search.
చిన్నారి 'మహానటి'కి జీవిత పాఠాలు నేర్పుతున్న నటకిరీటి...!
By: Tupaki Desk | 25 April 2020 10:11 PM ISTకరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం ఇళ్లలో బందీ అయ్యిందని చెప్పవచ్చు. లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన సెలెబ్రెటీస్.. బోర్ కొడుతుండడంతో సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతూ టైమ్ పాస్ చేస్తున్నారు. ఇంట్లోనే ఖాళీగా కూర్చున్న సెలెబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటూ వినోదాన్ని పంచుతున్నారు. 'బీ ది రియల్ మ్యాన్' ఛాలెంజ్.. పిల్లో ఛాలెంజ్.. పేపర్ ఛాలెంజ్ అంటూ కొత్త కొత్త ఛాలెంజ్ లను పరిచయం చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఇక టాలీవుడ్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్ విషయానికొస్తే న్యూ స్క్రిప్ట్స్ రాసుకునే పనిలో పడ్డారు. కొంతమంది సెలబ్రెటీలు చిన్నప్పటి నుండి మిగిలిపోయిన కోరికలను ఇప్పుడు నెరవేర్చుకుంటున్నారు. అనుకోకుండా వచ్చిన ఈ హాలిడేస్ ని రకరకాలుగా వినియోగించుకుంటున్నారు. ఇంట్లో చేసే వంటల వీడియోలను.. వర్క్ ఔట్ వీడియోలను.. డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. కొందరు సెలబ్రెటీలు ఇన్ని రోజులు తమలో దాగున్న టాలెంటుని బయటపెడుతున్నారు. మరికొందరు కరోనా వల్ల కావాల్సినంత సమయం దొరకడంతో వారి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొనే పనిలో పడ్డారు.
అలానే మన నటకిరీటి రాజేంద్రప్రసాద్ కూడా ఈ లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఆయన మనవరాలికి జీవిత పాటలను నేర్పిస్తూ గ్రాండ్ ఫాదర్ అనిపించుకుంటున్నాడు. రాజేంద్రప్రసాద్ మనవరాలు సాయి తేజశ్విని కూడా వెండితెరపై కనిపించింది. కీర్తి సురేష్ నటించిన సావిత్రి బయోపిక్ 'మహానటి' సినిమాలో చిన్నారి సావిత్రిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిన్న వయసులోనే మంచి నటన కనబరిచి తాతకు తగ్గ మనవరాలు అనిపించుకుంది. లాక్ డౌన్ కారణంగా స్కూల్స్ లేకపోవడంతో ఇంట్లో ఉంటున్న తన మనవరాలు సాయి తేజశ్వినికి ఆయన ఎన్నో విలువైన పాఠాలు చెబుతున్నారట. ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటే జీవితం చాలా బాగుంటుందని.. యోగా మరియు వాకింగ్ తో ప్రారంభమయ్యే ఆయన దినచర్య గార్డెనింగ్.. వంట చేయడం వంటి పనులతో చాలా ప్రశాంతంగా సాగుతోందని నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.