Begin typing your search above and press return to search.

తాగుబోతు డ్రైవర్లకు రాజేంద్రుడి క్లాసులు

By:  Tupaki Desk   |   21 Sep 2015 5:30 PM GMT
తాగుబోతు డ్రైవర్లకు రాజేంద్రుడి క్లాసులు
X
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మంచి వక్త. ఎలాంటి విషయాన్నైనా నవ్విస్తూనే సూటిగా చెప్పేస్తాడు నటికిరీటి. కొన్నిసార్లు ఈయన చెప్పే మాటలు మనసుని హత్తుకుపోతాయి కూడా. నవ్వులతో చెప్పినా నాటుకుపోయేలా చెప్పడం స్పెషలిస్ట్ గా రాజేంద్రప్రసాద్ కి మంచి పేరే ఉంది.

ఇప్పుడీయనకు హైదారాబాద్ పోలీసులు మంచి బాధ్యతనే ఇచ్చారు. అదే.. తాగి బండి నడిపేవాళ్లకు క్లాసులు పీకడం. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వాళ్లకి కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు పోలీసులు. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలను ఆహ్వానించి.. వారితో కాసిని మంచి మాటలు చెప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా రాజేంద్రుడు కూడా కౌన్సిలింగ్ క్లాసులకు అటెండ్ అయ్యాడు.

గత రోజులను ఊహించుకోండి, సెల్ ఫోన్ అనేది లేనే లేదు. అయినా హాయిగానే బతికేశాం. అనవసరమైన వస్తువులకు అధికంగా ప్రాధాన్యతనిచ్చి ప్రాణాలు పోగొట్టుకోవద్దంటూ.. రాజేంద్రప్రసాద్ చేసిన ఉపదేశం స్ట్రాంగ్ గానే ఉంది. మరో సీనియర్ కమెడియన్ బాబు మోహన్ కూడా ఈ క్లాసుల్లో పాల్గొనడం విశేషం. అయితే.. రాజేంద్రప్రసాద్ కౌన్సిలింగ్ ఇచ్చిన తీరుపై.. పోలీసులు కూడా సంతృప్తిగా ఉన్నారు. తమ అభిమాన నటుడితో సుద్దులు చెప్పించుకున్నా అయినా.. ఈ విషయంలో జనాలు బాధ్యతగా మలచుకుంటారేమే చూద్దాం.