Begin typing your search above and press return to search.
హీరో పెళ్లి పుకార్.. పత్రికా ప్రకటనతో ఖండన
By: Tupaki Desk | 8 Jun 2020 1:41 PM ISTఆ హీరోపై పెళ్లి పుకార్లు ఇప్పుడే కొత్త కాదు కానీ.. ఈసారి కాస్త కొత్తగా ప్రచారమైంది. గుట్టు చప్పుడు కాకుండా మాజీ ప్రేయసిని పెళ్లాడేశాడంటూ సాగంచిన పుకార్ కలవరపెట్టింది. అభిమానుల్లోనే కాదు.. సదరు హీరోగారి తండ్రిని తీవ్రంగా కలవరపెట్టింది. ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండించేందుకు ఏకంగా డబ్బు ఖర్చు చేసి పత్రికల్లో ప్రకటన ఇవ్వాల్సొచ్చింది! అంటే సీన్ ఎంత దూరం వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ ఎపిసోడ్ లో హీరో-హీరోయిన్- డాడీ ఎవరు? అన్న వివరాల్లోకి వెళితే..
తమిళ స్టార్ హీరో శింబు తన మాజీ ప్రేయసి నయనతారను పెళ్లాడేశారన్నది తాజా సోషల్ మీడియా ప్రచారం. ఈ ప్రచారంతో కంగారు పడ్డ శింబు తండ్రి గారు టి.రాజేందర్ ఆ వార్తల్ని ఖండించారు. అవన్నీ అవాస్తవం.. నమ్మవద్దు! అంటూ అభిమానుల్ని కోరిన ఆయన శింబు కోసం సరైన జీవిత భాగస్వామిని వెతుకుతున్నామని .. జాతకాలు కలిసే మగువ దొరికితే వెంటనే ఆ సంగతిని మీడియా ముఖంగా ప్రకటిస్తామని తెలిపారు. సోషల్ మీడియా పుకార్లను నమ్మొద్దని ఏకంగా పత్రికా ప్రకటన ఇచ్చారు.
ఇంతకుముందు పాల బుగ్గల హన్సికతో శింబు ప్రేమలో ఉన్నప్పుడు తనని పెళ్లాడేస్తున్నాడన్న పుకార్లు జోరుగా షికారు చేశాయి. ఆ తర్వాత అనూహ్యంగా హన్సిక బ్రేకప్ చెప్పేయడంతో ఓ బహిరంగ వేదికపైనా ఆ వైఫల్యంపై శింబు ఎమోషన్ అయ్యాడు. కెరీర్ ఆరంభమే నయనతారతో ఎఫైర్ సాగించినపుడు తనని పెళ్లాడేస్తాడంటూ తమిళ మీడియా ప్రచారం చేసింది. కానీ అది జరగలేదు. శింబు పెళ్లి వ్యవహారమే కాదు.. కెరీర్ వైఫల్యం.. క్రమశిక్షణారాహిత్యం.. నిర్మాతలతో గొడవలు.. సాటి హీరోలతో శత్రుత్వం వగైరా వగైరా తమిళ మీడియాలో విస్త్రతంగా ప్రచారం అయ్యాయి. అటుపై తెలుగు మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారాయి.